One plus 16 review: స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునేవారు కచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ చెక్ చేస్తారు. కెమెరా క్వాలిటీని పరిశీలిస్తారు. ప్రాసెసర్ పనితీరును అంచనా వేస్తారు.
ఈ మూడు విభాగాల్లో ఆకట్టుకునే స్పెసిఫికేషన్ లతో అదరగొడుతోంది oneplus 16
9000 mAh బ్యాటరీ, 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 185 హెచ్ జెడ్ వరకు రీ ఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే, కొత్త తరం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్.. ఇవన్నీ చూస్తే ఈ ఫోన్ పై ఆసక్తి మరింత పెరుగుతోంది. చైనాలో ఈ ఫోన్ ను అక్టోబర్ 12న విడుదలైంది. మనదేశంలో విడుదల.. ధర వంటి వాటిపై అధికారిక ప్రకటన రావాలి.
Oneplus 16 లో 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంది. వేగంగా కదిలే గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇందులో అధికంగా రీ ఫ్రెష్ రేట్ ఉంటుంది.
185 హెచ్ జెడ్ వరకు రీ ఫ్రెష్ రేట్ ఉండడంవల్ల స్క్రీన్ స్క్రోలింగ్.. యానిమేషన్లు.. సపోర్టు ఉన్న గేమ్స్ మరింత స్మూత్ గా కనిపించే అవకాశం ఉంది. అయితే అన్ని యాప్ లు, గేమ్స్ 185 హెచ్ జెడ్ వద్ద పనిచేస్తాయని కాదు. సినిమాలు చూడడం.. సోషల్ మీడియా ఉపయోగించడం.. గేమింగ్ చేయడం ఇష్టపడే వారికి ఈ డిస్ ప్లే అద్భుతంగా ఉండవచ్చు.
ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఈ తరహా ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ తో హై ఎండ్ గేమ్స్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వంటి పనులకు ఉపయోగపడే అవకాశం ఉంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కడం.. ఎక్కువసేపు వాడినప్పుడు ప్రేమ్ రేట్లు ఎలా ఉంటాయి, బ్యాటరీ ఎంత వేగంగా తగ్గుతుంది వంటి అంశాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
కెమెరాలను ఒకసారి పరిశీలిస్తే.. 200 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అధిక రిజల్యూషన్ తో ఫోటోలు తీయవచ్చు. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరాతో ల్యాండ్ స్కేప్, పెద్ద గ్రూప్ ఫోటోలు తీయవచ్చు. 50 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరాతో 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో ఫోటోలు తీయవచ్చు. 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు.. వీడియో కాల్ చేయవచ్చు.
ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీ గేమింగ్ చేసే వారికి.. వీడియోలు చూసేవారికి.. ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడవచ్చు. 100 డబ్ల్యు వైర్డ్ చార్జింగ్, 50 w వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
చైనాలో 12 జిబి రామ్, 256 జిబి స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 5999 చైనా యోన్ లుగా నిర్ణయించారు. మనదేశంలో అయితే ఇది దాదాపు 86 వేల వరకు ఉండవచ్చు.

