Dailyhunt
ఒరాకిల్ జాబ్ నుంచి తీసేసింది.. ఈ టెకీ లైఫ్ బిందాస్ అయింది.. చదవాల్సిన స్టోరీ ఇది

ఒరాకిల్ జాబ్ నుంచి తీసేసింది.. ఈ టెకీ లైఫ్ బిందాస్ అయింది.. చదవాల్సిన స్టోరీ ఇది

Oktelugu.com 4 days ago

Oracle Employee Job Loss Success Story: ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అందువల్లే చాలామంది యువకులు చదువును విజ్ఞానాన్ని పెంచుకోవడానికి కాకుండా..

ఉద్యోగం మాత్రమే సాధించడానికి వాడుతారు. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే సంపాదించిన ఉద్యోగం కొన్ని సందర్భాల్లో పోవచ్చు. కానీ నేర్చుకున్న జ్ఞానం ఎక్కడికి పోదు. కొందరికి ఇది అనుభవం ద్వారా వస్తుంది. అటువంటి అనుభవమే ఇతడికి ఎదురయింది. చివరికి జీవితాన్ని ఉల్లాసంగా మార్చేసింది.

అతడు ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగి. జీతం ఐదు అంకెలకు పైనే వస్తుంది. సౌలభ్యాలు.. సౌకర్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజులన్నీ ఒకే విధంగా ఉండవన్నట్టు.. ఆనందంగా సాగిపోతున్న అతని జీవితంలో స్పీడ్ బ్రేక్ పడింది. ఇన్నాళ్లపాటు అతనితో పని చేయించుకున్న కంపెనీ మీ సేవలు అవసరం లేదని చెప్పేసింది. లాప్టాప్కు యాక్సిస్ ఆపేసింది. ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఉద్యోగం దొరికే అవకాశం లేదు. తనలో తానే ఆలోచించుకున్నాడు. ఒత్తిడికి గురికాకుండా మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫలితంగా అతని జీవితం మరో టర్న్ తీసుకుంది.

ఉద్యోగంలో ఉన్నప్పుడు అతడు పోస్టల్.. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆదాయం వచ్చేలా చూసుకున్నాడు. అలా ప్రతినెల అతడికి 43 వేల రూపాయల స్థిరమైన ఆదాయం వస్తోంది. ఉద్యోగం పోయిన తర్వాత తన సొంత రాష్ట్రమైన ఒడిశాక వెళ్లిపోయాడు. భువనేశ్వర్ నగరంలో ఉబర్ కంపెనీలో చేరాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన అతడు ఇప్పుడు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి సంతోషంతో జీవిస్తున్నాడు. అతడికి ఎటువంటి ఈఎంఐలు లేవు. అప్పులు కూడా లేవు. ఉద్యోగంలో ఉన్నప్పుడు శని, ఆదివారాలు ఇంట్లోనే ఉండేవాడు. కాకపోతే డ్రైవింగ్ నేర్చుకునేవాడు. నాడు అతడు నేర్చుకున్న డ్రైవింగ్ ఇప్పుడు ఉపాధి కల్పిస్తోంది.

చాలామంది ఐటీ ఉద్యోగులు భారీ వేతనం రాగానే అప్పులు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఆరాటపడుతుంటారు. రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. సౌలభ్యాలను.. సౌకర్యాలను ఇష్టపడుతుంటారు. కానీ.. కొంతమంది మాత్రమే పొదుపు చేస్తారు. అలా పొదుపు చేసినవారే ఉద్యోగాలు పోయినా సరే నిలబడగలుగుతారు. అచ్చం ఈ భువనేశ్వర్ వ్యక్తి లాగా.. ఇప్పుడు అతడికి ఐటీ ఉద్యోగం లేదు కానీ నెలకు 43 వేల వరకు వస్తుంది. దానికి తోడు ఉబర్ డ్రైవర్గా నెలకు 50 నుంచి 70 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కలుపుకుంటే 1,13,000.. ఒత్తిడి లేదు. ఉద్యోగం పోతుందనే భయం లేదు. జీతం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒక మనిషిగా అతడు ఒత్తిడి ని చేయించాడు. తన కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాకుతున్నాడు. ఇతడి పాఠాన్ని చాలామంది ఐటీ ఉద్యోగులు గుణపాఠం లాగా మార్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం అనేది శాశ్వతం కాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com