Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాపం బుచ్చిబాబు.. ముంబైలో ప్రెస్ మీట్ లో అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో...

పాపం బుచ్చిబాబు.. ముంబైలో ప్రెస్ మీట్ లో అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో...

Oktelugu.com 2 days ago

Buchi Babu Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. ఇక మన దర్శకులు సైతం ఇతర భాషల్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మన దర్శకులు చేస్తున్న సినిమాలు యావత్ ప్రేక్షక లోకాన్ని మెప్పించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందువల్లే మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషల హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మన దర్శకులు కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయలేకపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన సినిమాలు చేయకుండా ఉండటం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ట్రాన్స్లేట్ చేసేవాళ్లను పెట్టుకుని సినిమాని చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో లాంగ్వేజ్ రాకపోవడం చాలా ఇబ్బందిని కలిగిస్తుందనే విషయం మనకు రీసెంట్ గా బుచ్చిబాబు ని చూస్తే అర్థమవుతుంది.

పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ లో భాగంగా ముంబైలో ఒక ఈవెంట్ ను కండక్ట్ చేశారు. అక్కడ బుచ్చిబాబును ఇంగ్లీషులో కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పలేకపోయాడు. తెలుగుకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటూ చెప్పడం అక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక ఎవరో అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఆయన ‘దిస్ ఇస్ ఆల్సో తెలుగు’ అని చెప్పడం వల్ల అక్కడున్న వాళ్ళందరు నవ్వుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు కి చాలా టాలెంట్ ఉన్నప్పటికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తను ఎక్కువగా మాట్లాడలేకపోయాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సినిమా తీసే కెపాసిటి ఉంటే సరిపోతుంది.

లాంగ్వేజ్ ఏముంది అది రాకపోయినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన పెద్ది సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని రామ్ చరణ్ ఇమేజ్ ను సైతం పెంచుతుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com