Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది మూవీలో ప్లస్ లు మైనస్ లు ఇవే...

పెద్ది మూవీలో ప్లస్ లు మైనస్ లు ఇవే...

Oktelugu.com 2 days ago

Peddi Plus Points: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను ఇస్తున్నప్పటికి సినిమాలో కొన్ని నెగెటివ్ పాయింట్లు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? నెగెటివ్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…

ప్లస్ పాయింట్స్

రామ్ చరణ్ ను ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆయన ఆధ్యాంతం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో తనను తాను చాలా బాగా పోట్రే చేసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ లో కూడా ఆయన ఒదిగిపోయి నటించాడు.

ఇక తన బాడీ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని ఇండస్ట్రీలో అంతటి మంచి బాడీని ఎవరు బిల్డ్ చేయలేరు అనేంతలా కష్టపడి తన బాడినైతే బిల్డ్ చేసుకున్నాడు. ఇక తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అయితే తెప్పించాడు. పెద్ది క్యారెక్టర్ లో తను తప్ప ఎవరు ఆపా ను చేయలేరు అనేంతలా నటించి మెప్పించాడు.

ఇక ఫస్టాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి…హాస్పిటల్ సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా బాగా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది…

మైనస్ పాయింట్స్

ఈ మూవీలో విలేజ్ సెట్ అప్ అనేది ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది అంత బాగా సెట్ చేయలేకపోయారు… సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఒక టైమ్ కి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక చిన్న డైలమా అయితే మనకు కనిపిస్తుంది.క్లైమాక్స్ ఎపిసోడ్ ఓకే అనిపించినప్పటికి అది ముందే మనకు రివిల్ అయిపోవడం వల్ల అందులో ఉన్న సస్పెన్స్ ను మనం ఎంజాయ్ చేయలేకపోయాం…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com