Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది రిజల్ట్ తేడా కొడితే ఈ ఇద్దరు కోలుకోవడం కష్టమేనా..?

పెద్ది రిజల్ట్ తేడా కొడితే ఈ ఇద్దరు కోలుకోవడం కష్టమేనా..?

Oktelugu.com 1 week ago

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న 'పెద్ది' సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

గత సంవత్సరం చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించపోవడంతో ఆయన మార్కెట్ కొంత వరకు తగ్గింది. ఇక ఎలాగైనా సరే పెద్ది సినిమాతో తను భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా అద్భుతంగా వచ్చినప్పటికి ఇందులో కొన్ని ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి అంటూ ఫిలిం నగర్ సర్కిల్ నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి…నిజానికి సినిమా సక్సెస్ అయితే పర్లేదు కానీ ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం ఇద్దరి కెరియర్లు రిస్కు లో పడే ప్రమాదం ఉంది. వాళ్లెవరూ అంటే ఒకరు రామ్ చరణ్ కాగా, మరొకరు బుచ్చిబాబు…ఎందుకంటే రామ్ చరణ్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీర్లందరు భారీ విజయాలను సాధిస్తున్న క్రమంలో రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియాలో సోలో హీరోగా 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఒక్కటి కూడా చేయలేదు…

అందువల్లే ఆయన చాలావరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమా తర్వాత డైరెక్ట్ గా రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? లేదా అనే ధోరణిలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.

ఒకవేళ బుచ్చిబాబు సక్సెస్ ని సాధించకపోతే మాత్రం ఆయన కెరీర్ డీలా పడిపోయే అవకాశమైతే ఉంది. ఆయన వెనకాల సుకుమార్ ఉన్నాడనే కాన్ఫిడెంట్ తో రామ్ చరణ్ అతనికి సినిమా ఇచ్చాడు కానీ లేకపోతే మాత్రం రామ్ చరణ్ తనకి సినిమా ఇచ్చేవాడు కాదు.

ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాప్ డైరెక్టర్ గా మారుతాడా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే పెద్ది సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం బుచ్చిబాబు, రామ్ చరణ్ కెరియర్ల మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటూ సినిమా మేధావులు కామెంట్స్ చేస్తున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com