Dailyhunt
ప్లే ఆఫ్ లు అక్కడే.. ఊహించని వేదికపై ఫైనల్.. దక్షిణాదికి బీసీసీఐ అన్యాయం

ప్లే ఆఫ్ లు అక్కడే.. ఊహించని వేదికపై ఫైనల్.. దక్షిణాదికి బీసీసీఐ అన్యాయం

Oktelugu.com 5 days ago

BCCI playoff venue controversy: ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది.. ఇప్పటికే చాలా వరకు జట్లు లీగ్ మ్యాచ్లు ఆడేశాయి. ఇంకా కొన్ని ఆడితే లీగ్ సమరం ముగుస్తుంది.

ఆ తర్వాత ప్లే ఆఫ్ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బీసీసీఐ క్లారిటీ చేసింది.

ఈసారి ప్లే ఆఫ్ మ్యాచ్ ల నిర్వహణ వేదికలను బిసిసిఐ ప్రకటించింది. ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం దక్షిణాదికి అన్యాయం చేసే విధంగా ఉంది. దక్షిణ భారత దేశంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ నిర్వహణకు వేదికను ఖరారు చేయలేదు. ప్లే ఆఫ్ మ్యాచ్ లు నిర్వహించేందుకు రెండు వేదికలను మాత్రమే బిసిసిఐ ఖరారు చేసింది. మే 24 న లీగ్ మ్యాచ్లో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ తో నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.

మొదట్లో బెంగళూరులో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారని అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 31న నిర్వహిస్తారు.. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ను మే 26న ధర్మశాల వేదికగా నిర్వహిస్తారు.. ఎలిమినేటర్ మ్యాచ్ ను చండీగఢ్ వేదికగా మే 27న నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ను 29న నిర్వహిస్తారు.

పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ సమరంలో పోటీ పడతాయి. మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లు మొదటి క్వాలిఫైయర్ లో పోటీ పడతాయి. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ గెలుస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. మూడు నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ లో పోటీ పడతాయి. అందులో విజయం సాధించిన జట్టు రెండవ క్వాలిఫైయర్ కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫైయర్ 1 లో ఓటమి పాలైన జట్టుతో ఎలిమినేటర్ విజేత పోటీ పడుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ వెళ్తుంది. అక్కడ గెలిచిన జట్టు ట్రోఫీ అందుకుంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com