Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్ రాజు - ఎంఎస్ రాజు మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి..

ప్రభాస్ రాజు - ఎంఎస్ రాజు మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి..

Oktelugu.com 1 week ago

Prabhas MS Raju controversy: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్…మొదటి రెండు సినిమాలతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా 'వర్షం' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన నటుడు ప్రభాస్… తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ నటుడు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోయాడు.

‘వర్షం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఎమ్మెస్ రాజు తో మంచి పరిచయమైతే ఏర్పడింది. వర్షం సినిమా ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం…వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత ‘పౌర్ణమి’ సినిమా వచ్చింది. ఆ సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్న కూడా అది వర్కౌట్ కాలేదు.

కారణం ఏంటంటే ఎమ్మెస్ రాజు విషయంలో కొంతవరకు హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్లిద్దరు కలిసి ఒక దర్శకుడి తో సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ ఆ దర్శకుడు చెప్పిన కథను ఎమ్మెస్ రాజు చాలా వరకు మార్చేశారట. దాంతో ఆ దర్శకుడు డిసప్పాయింట్ అయి ప్రభాస్ కి ఆ విషయాన్ని చెప్పాడు.

దాంతో ఎమ్మెస్ రాజు తో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ సాధించలేదేమో అనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఆయన మార్చిన కథను వినడానికి కూడా ఇష్టం లేక నో చెప్పారట. ఇక అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు డిస్టెన్స్ అయితే పెరిగిందని అందువల్లే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావడం లేదంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…

మొత్తానికైతే ప్రస్తుతం తను పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. తనను బీట్ చేయడం ఇప్పుడున్న హీరోల వల్ల కావడం లేదనేది వాస్తవం… ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలు చేస్తే అతన్ని ఢీకొట్టే వారు ఎవరు ఉండరనేది వాస్తవం… ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ సినిమాలను చేస్తు బిజీగా ఉన్నాడు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com