Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ప్రశ్న రావణ్' ఫోన్లో అశ్లీల వీడియోలు.. సంచలనం రేపుతున్న ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్..

'ప్రశ్న రావణ్' ఫోన్లో అశ్లీల వీడియోలు.. సంచలనం రేపుతున్న ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్..

Oktelugu.com 3 days ago

Prashna Ravan: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో , ఎలక్ట్రానిక్ మీడియా లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు 'ప్రశ్న రావణ్'. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై , హిందూ దేవుళ్లపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడం, ఉగ్రవాదులు , నక్సలైట్ లను సపోర్టు చేస్తూ వీడియోలు చేయడం వంటి కార్యక్రమాల వల్ల , ఇతని పై UAPA చట్టం క్రింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రావణ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలు లో ఉన్నారు. అయితే ‘ప్రశ్న రావణ్’ ని విచారణ లో భాగంగా ఆయన మొబైల్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. చాలా వరకు డేటా ఆయన తన మొబైల్ నుండి తొలగించడంతో , రీ స్టోర్ చేసే ప్రక్రియ కోసమే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు.

ఈ ల్యాబ్ లో ఆయన మొబైల్ నుండి సంచలన విషయాలను కనుగొన్నారు అధికారులు. అనేక అశ్లీల వీడియోలు రావణ్ మొబైల్ లో ఉన్నాయట. ఈ వీడియోలను వాడుకొని దాదాపుగా 10 మంది మహిళలను ఇతగాడు బ్లాక్ మెయిల్ చేశాడని , వాళ్ళని లైంగికంగా ఎంతో వేధించినట్టు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. వీటి వివరాలు పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపర్చనున్నారు పోలీసులు. ఇంకా ఆయనకు సంబంధించిన వివరాలను , నెట్వర్క్ ని ఛేదించడానికి పోలీసులు సుదీర్ఘ విచారణ చేపడుతున్నారు. ఇతన్ని అరెస్ట్ చేసిన మొదటి రోజు నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎలా గిలగిలలాడిపోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నాన్ స్టాప్ గా వీడియోల మీద వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రశ్న రావణ్ పై అన్యాయంగా కేసులు పెట్టినట్టు జనాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా తన మొబైల్ ఫోన్ లోని డేటా ని వాడుకొని అతనికి మద్దతుగా నిల్చిన వారిని వేధించబోతున్నారనే విషయాన్ని కూడా ప్రకాష్ రాజ్ తెలిపాడు.

దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకు సంబంధించిన సమాచారం ఎదో బలమైనది ఉందని తెలుస్తోంది. ఆ సమాచారం బయటపడితే తన చాప్టర్ క్లోజ్ అని ప్రకాష్ రాజ్ భయపడుతున్నదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అదే నిజం అయ్యేలా ఉంది , ప్రకాష్ రాజ్ తో రావణ్ కి ఉన్నటువంటి సంబంధాలను మొత్తం బయటపెట్టే పనిలో ఉన్నారట పోలీసులు. ఒకవేళ ఏదైనా సంఘ విద్రోహ చర్యలకు వీళ్లిద్దరు ప్రయత్నం చేసుంటే , కచ్చితంగా ప్రకాష్ రాజ్ కి కూడా నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో , ఇతనికి సపోర్టుగా నిలుస్తూ వచ్చిన వైసీపీ నెమ్మదిగా ప్లేట్ ఫిరాయించింది. రావణ్ తమ మనిషి కాదని , అతను తెలుగు దేశం పార్టీ కి చెందిన వాడు అంటూ స్టీరింగ్ తిప్పింది. మొత్తానికి ఈ అంశంలో వేలుపెట్టి వైసీపీ పార్టీ కొత్త సమస్యలను కొని తెచ్చుకుంది అనే చెప్పాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com