Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..

ప్రతి రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..

Oktelugu.com 2 days ago

Meditation Benefits: ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా భావోద్వేగాలను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే 10 నిమిషాల ధ్యానంతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?

ఆందోళన, భయం మాయం..
కొంతమంది మానసిక నిపుణుల ప్రకారం… ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. దీని కారణంగా టెన్షన్, ఆందోళన, భయం వంటి భావనలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. రోజూ ధ్యానం చేసే వారికి మానసిక ప్రశాంతత పెరిగి, చిన్న చిన్న విషయాలకు కోపం లేదా ఆవేశం తగ్గుతుందని చెబుతున్నారు.

ఆలోచన శక్తి మెరగు..
ధ్యానం ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు లేదా వ్యాపారులు ఎవరైనా సరే మెడిటేషన్ అలవాటు చేసుకుంటే ఆలోచనా శక్తి మెరుగవుతుంది. సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకుని త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. దీంతో పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.

ఎప్పడు ధ్యానం చేయాలి?
ఉదయం సమయంలో ధ్యానం చేయడం శరీరానికి మరింత మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెడిటేషన్ సమయంలో లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు అలసట తగ్గుతుంది. శరీరం, మనసు రెండూ సమతుల్యంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది.

నిద్ర సమస్యలు దూరం..
అలాగే ధ్యానం నిద్ర సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువగా ఆలోచించడం వంటి సమస్యలు ఉన్నవారు రోజూ కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయడం వల్ల మానసిక స్థిరత్వం పెరిగి జీవితాన్ని సానుకూలంగా చూడగలుగుతారని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com