Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ ను కొట్టిన స్టార్ హీరో ఎవరు..?

రామ్ చరణ్ ను కొట్టిన స్టార్ హీరో ఎవరు..?

Oktelugu.com 3 months ago

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చాలా మంచి ఇమేజ్ ఉంది. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారాడు.

ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. ప్రేక్షకులు ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటారు. అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రామ్ చరణ్ చిన్నతనంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతని బాగోగులు చూసుకునేవారట. చిరంజీవి షూటింగ్ కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉండేవాడు.

కాబట్టి రామ్ చరణ్ ని తనే ఎత్తుకొని ఆడిస్తూ స్కూల్ కి కూడా తనే తీసుకెళ్లేవాడట. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పిన హోంవర్క్ చేయకపోతే పవన్ కళ్యాణ్ తనని కొట్టారట. ఆ విషయాన్ని రామ్ చరణ్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

నిజానికి పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కి చాలా భయం అని చిన్నప్పుడు అంత భయపెట్టేవాడని ఒక ఇంటర్వ్యూలో ఫన్నీగా చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ విషయం మీద రామ్ చరణ్ ను కొట్టిన స్టార్ హీరో అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. చిరంజీవి షూటింగ్లో ఉండటం వల్ల ఇంట్లో పవన్ కళ్యాణ్ ఎక్కువసేపు ఉండటంతో రామ్ చరణ్ తో ఎక్కువ సేపు గడిపే అవకాశమైతే అతనికి దొరికింది.

అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికి రామ్ చరణ్ ను కొడుకుగా కంటే కూడా తనకి ఒక తమ్ముడిగా భావిస్తూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ కుదరడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… వీళ్ళిద్దరు ఎప్పటికి ఇలానే ఉండాలని పవన్ కళ్యాణ్ అటు రాజకీయ రంగం లో రాణిస్తూనే అవకాశం దొరికినప్పుడు సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com