Dailyhunt
రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్క వెలితి కనిపిస్తుందా...

రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్క వెలితి కనిపిస్తుందా...

Oktelugu.com 3 days ago

Ram Charan movies missing element: రామ్ చరణ్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక పెద్ది సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాలనే ఉద్దేశ్యంతో వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నప్పటికి ఆయన సినిమాల్లో ఒక వెళితే కనిపిస్తుంది..అది ఏంటి అంటే రామ్ చరణ్ చేసే ప్రతి సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికి ఆయన ఒక ఆర్ట్ సినిమాని చేస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే ఆయన నుంచి అలాంటి సినిమా వస్తుందా? వచ్చిన ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి మాస్ హీరో ఆర్ట్ సినిమా చేయడం అనేది సరైనది కాదంటూ కొంతమంది విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం పెద్ది సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక భారీ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా అలాంటి నటుడు యావత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీని కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు రామ్ చరణ్ సాధించిన సక్సెస్ లతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సైతం తన హవా కొనసాగించాలని ముందుకు సాగుతున్నాడు. ఇక పెద్ది సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతాడా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com