Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కథ అక్కడి నుంచి లేపేశారా..?

రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కథ అక్కడి నుంచి లేపేశారా..?

Oktelugu.com 3 days ago

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇంతకుముందు రంగస్థలం సినిమా వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది.

ఇప్పటికే రామ్ చరణ్ వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్లో చేసిన ‘పెద్ది’ సినిమా వచ్చే నెల నాలుగోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ మూవీ ఆశించిన మేరకు సాధించకపోవడంతో ఈ సినిమా మొత్తానికైతే ప్రేక్షకుల్లో ఒక విశేషమైన స్పందన రాబడుతుందనే అనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సుకుమార్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన మెకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ సైతం ఈ కథని చాలా డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట…

ఇక హాలీవుడ్ లో వచ్చిన ‘ఇన్సెప్షన్’ సినిమా ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కథనైతే డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో పల్లెటూరు నేపథ్యంలో రంగస్థలం సినిమా వచ్చింది.

అయితే ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా హై టెక్నాలజీ తో ఒక కథనైతే రెడీ చేశారట. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ను సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా రామ్ చరణ్ ఇమేజ్ ను రెట్టింపు చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. రాజమౌళి తర్వాత పాన్ ఇండియాలో ఆ రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…

ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియాలో అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటే అతను మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com