Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ram Charan Peddi: రామ్ చరణ్ పెద్ది ఆడకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకున్న మేకర్స్.

Ram Charan Peddi: రామ్ చరణ్ పెద్ది ఆడకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకున్న మేకర్స్.

Oktelugu.com 1 week ago

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉండేవి. కానీ ఆ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేదు.

కారణం ఏదైనా కూడా ఒక సినిమా ఆడకపోతే దానికి పూర్తి బాధ్యత దర్శకుడు తీసుకోవాలి. ఎందుకంటే అతన్ని నమ్మి చేసిన కథ కాబట్టి హీరోని పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన కూడా సినిమాలో ఏదో మైనస్ ఉండడం వల్లే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చదు. అలాంటి క్రమంలోనే ఇప్పటికి బుచ్చిబాబు ఈ సినిమాకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి అనేది కూర్చొని చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక స్టార్ హీరోతో అలాంటి క్యారెక్టర్ ని చేయించడం అనేది ఒక మైనస్ అయితే, ఈ సినిమాలో సోల్ పాయింట్ అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఊరు, ఐడెంటిటీ అనేది హీరో ఎంచుకున్న పాయింటు దానికోసం ఆయన ఎక్కడిదాకా అయినా వెళ్తాడు.

మరి ఆ ఊరు ఎలా ఉంది. అసలు ఆ ఊరు ప్రజల ఇంటెన్స్ ఏంటి? ఆ ఊర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దానివల్ల హీరో ఎందుకోసం ఫైట్ చేస్తున్నాడు అనే విషయంలో కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకు చిన్నపాటి కన్ఫ్యూజన్ వచ్చింది.

ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఇక బుచ్చిబాబు తన సినిమాలో హీరోకి ఏదో ఒక బాడీ పార్ట్ తీసివేయాలనే ఫాంటసీ ఎందుకు పెట్టుకున్నాడు. ఎందుకని ఆయన తన పైత్యాన్ని సినిమాల మీద రుద్దుతున్నాడు. అంటు కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక రాబోయే సినిమా విషయంలో అయిన తను చాలా కేర్ఫుల్ గా ఉండాలి.

లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అంటూ సినిమా మేధావులు సైతం అతనికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు…ఇక ప్రస్తుతం బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com