Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramakrishna Agni Pareeksha: 'అగ్ని పరీక్ష 2' లో దూసుకొస్తున్న రామకృష్ణ.. ఆ ఇద్దరి టాప్ కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓటింగ్!

Ramakrishna Agni Pareeksha: 'అగ్ని పరీక్ష 2' లో దూసుకొస్తున్న రామకృష్ణ.. ఆ ఇద్దరి టాప్ కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓటింగ్!

Oktelugu.com 1 week ago

Ramakrishna Agni Pareeksha: ఎంతో అట్టహాసంగా మొదలైన 'అగ్ని పరీక్ష 2' మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది. గత సీజన్ తో పోలిస్తే , ఈ సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కడ చూసిన ఈ సీజన్ గురించే చర్చించుకుంటున్నారు నెటిజెన్స్. జరిగిన సంఘటనలు అలాంటివి మరీ. అయితే ఈ సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని ఆడిషన్స్ లో చూసినప్పుడు, అసలు వీళ్ళు పనికిరారని జడ్జీలతో పాటు, ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ కట్ చేస్తే వాళ్ళే ఇప్పుడు ‘అగ్ని పరీక్ష 2’ లో మెరుస్తున్నారు. అందులో ఒకరు రోహిత్ నాయుడు కాగా, మరొకరు నవరసాల మామ రామకృష్ణ. ఇద్దరూ కూడా జడ్జీల దగ్గర కేవలం ఒక్క గ్రీన్ ఫ్లాగ్ మాత్రమే సొంతం చేసుకున్నారు, కానీ వీళ్ళు ఇప్పుడు షో లో తిరుగులేని స్టార్స్ గా కొనసాగుతున్నారు.

వీళ్లిద్దరు కచ్చితంగా ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే, ముఖ్యంగా రామకృష్ణ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. తన తోటి కంటెస్టెంట్స్ మొత్తం , ఇతనికి ఆట అసలు అర్థం అవ్వదు, బిగ్ బాస్ కి పనికిరాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ రామకృష్ణ వాళ్ళు తనని తక్కువ అంచనా వేస్తున్నారు, తనలోని టాలెంట్ చూపిస్తా అంటూ ప్రతీ టాస్క్ లోనూ తన వైపు నుండి ది బెస్ట్ ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే రామకృష్ణ గ్రాఫ్ బాగా పెరిగింది కానీ, ఓట్లు పడడం లేదని నిన్న మొన్నటి వరకు విశ్లేషకులు కామెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు రామకృష్ణ ఓటింగ్ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా నేటి ఎపిసోడ్ ఆయనకు అద్భుతమైన మైలేజ్ ఇచ్చింది. షాలిని గతం లో రామకృష్ణ ని ఎంతలా అవమానించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

పదే పదే అతని ముఖం పై ‘షట్ అప్’ అని అరుస్తూ, చాలా బలుపు చూపించింది. అలాంటి షాలిని కి నేడు రామకృష చుక్కలు చూపించాడు. దెబ్బకు ఆమెకు నోటి నుండి మాటలు రావడానికి కష్టమైంది. రామకృష్ణ సత్తా ని చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యపోతూ , ఇతన్ని ఎలా అయినా బిగ్ బాస్ కి పంపాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ పోల్స్ లో రామ కృష్ణ కి అద్భుతమైన ఓటింగ్ పడుతోంది. ఈ ఓటింగ్ అధికారికంగా కూడా రిఫ్లెక్ట్ అవుతుందని, అతని బిగ్ బాస్ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయ్యినట్టే అని అంటున్నారు. చూడాలి మరి జడ్జీలు రామకృష్ణ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారా?, లేదా చివరి నిమిషం లో ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com