Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramoji Rao: రామోజీరావు జయంతి: చంద్రబాబును ఎదిరించిన ఏబీఎన్ రాధాకృష్ణ

Ramoji Rao: రామోజీరావు జయంతి: చంద్రబాబును ఎదిరించిన ఏబీఎన్ రాధాకృష్ణ

Oktelugu.com 11 hrs ago

Ramoji Rao: రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి నిర్వహిస్తామని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీన్ని కొంతమంది వ్యతిరేకించారు. ఈనాడు గొప్పగా రాసుకుంది.

ఎప్పటిలాగానే సాక్షి దీనిని ఖండించింది. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇక్కడితోనే ఆగిపోయింది అనుకుంటే.. ఆంధ్రజ్యోతి పత్రిక చైర్మన్ వేమూరి రాధాకృష్ణ మొదలుపెట్టారు. ఆదివారం తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు సంపాదకీయం లో ఈ తేనె తుట్టెను కదిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమముగా చంద్రబాబు రామోజీరావు జయంతి నిర్ణయిస్తామని చెప్పడాన్ని రాధాకృష్ణ నేరుగానే ప్రశ్నించారు. అసలు రామోజీరావు జయంతి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో జరుపుకునే అర్హత ఉందా అంటూ అడిగేశారు.

ఏపీ రాష్ట్రం ఇప్పటికే వర్గాలుగా.. కులాలుగా.. మతాలుగా విడిపోయింది. మీడియా ఆధిపతులు వివాదాలకు అతీతంగా ఉండటం లేదు. రామోజీరావు కూడా అటువంటి వ్యక్తే. రామోజీరావు జయంతిని అధికారికంగా నిర్వహిస్తే ఆయన భూమికి తిరిగిరారు. చూసేది ఏమీ ఉండదు. ఆనందించే అంశం కూడా ఉండదు. రామోజీరావు మీడియా అధినేత. కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి. చంద్రబాబు నోటి నుంచి ఆయన జయంతికి సంబంధించిన ప్రటన రాగానే ఆ వర్గాన్ని వ్యతిరేకించే వారు మొత్తం తమ నోటికి పని చెప్పారు. జాతిపితలుగా ప్రకటించుకున్న వారిని కూడా పొలం కోణంలో చూస్తున్నారు. రామోజీరావు లేదా మరొక జయంతిని ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రకటించడం అవసరమా… ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు సంపాదకీయం.

వాస్తవానికి రామోజీరావు జయంతిని ప్రభుత్వ పండుగ నిర్వహిస్తామని చంద్రబాబు అనడం వివాదానికి కారణం. రాష్ట్ర పండుగ మాదిరిగా కాకుండా, అధికారికంగా నిర్వహిస్తామని చెబితే బాగుండేది. కానీ చంద్రబాబు రాష్ట్ర పండుగ అనడంతో వివాదం మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పి లక్ష్మణస్వామి వర్మ.. గురజాడ అప్పారావు.. గౌతు లచ్చన్న.. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు.. నందమూరి తారక రామారావు.. వడ్డే ఓబన్న.. గౌతు లచ్చన్న.. మండలి వెంకట కృష్ణారావు.. వంటి వారి జయంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించేలాగా ఉత్తర్వులు జారీ చేయించారు. వారి విషయంలో ఎటువంటి వివాదం ఏర్పడలేదు. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామోజీరావు జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించడమే వివాదానికి కారణమైంది.

రామోజీరావు వివాదం ఇలా పెరగడానికి ప్రధాన కారణం ఆయన గతంలో వ్యవహరించిన విధానాలే అని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమికి ఈనాడు వన్ సైడ్ సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నించింది. చివరికి జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే కూడా తప్పు పట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబుకు ఈనాడు మొదటి నుంచి ఇప్పటివరకు అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉందని.. అందువల్లే రామోజీరావుకు ఈ స్థాయిలో గౌరవం కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఇవే అంశాలను రాధాకృష్ణ తన వ్యాసంలో ప్రస్తావించారు. ఇందులో రామోజీరావు దక్కుతున్న గౌరవం చూసి రాధాకృష్ణకు అసూయ కలిగిందేమోనని.. ఈనాడుకు తన పత్రికకు మించి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఆయనకు కంటగింపుగా మారిందేమోనని.. అందువల్లే కొత్త పలుకు వ్యాసం రాశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ రాధాకృష్ణ వ్యాసం కచ్చితంగా వైసీపీ వాళ్లకు ఒక అస్త్రం లాగా మారుతుంది. మరి దీనిని ఎలా టాకిల్ చేయాలి.. అనేది టిడిపి నేతలకు అంతుపట్టడం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com