Dailyhunt
రణబీర్ కపూర్ 'రామాయణ్' టీజర్ రివ్యూ : విజువల్ వండర్ కి సరికొత్త నిర్వచనం..

రణబీర్ కపూర్ 'రామాయణ్' టీజర్ రివ్యూ : విజువల్ వండర్ కి సరికొత్త నిర్వచనం..

Oktelugu.com 2 weeks ago

Ranbir Kapoor Ramayan Teaser Review: బాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి(Nitish Tiwari) దర్శకత్వం లో 1800 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో రామాయణం(Ramayan : Part 1) ని రెండు భాగాలుగా గత కొంతకాలం నుండి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

రణబీర్ కపూర్(Ranbir Kapoor) ఇందులో శ్రీరాముడిగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ యాష్ రావణుడిగా నటిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి యాష్ సహా నిర్మాతగా కూడా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక సీత పాత్రలో సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ , సూర్పనక్క పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు.

అట్లాంటాలో 'తానా' సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతం

ఈ టీజర్ ని చూసిన తర్వాత విజువల్స్ కోసం మేకర్స్ ఏ రేంజ్ లో ఖర్చుపెడుతున్నారో అర్థం అవుతోంది. డైలాగ్స్ ఎందుకో ఈ టీజర్ లో చూపించలేదు కానీ, శ్రీ రాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న సమయం లోని షాట్స్, అదే విధంగా ఆయన అరణ్యవాసం లో ఉన్నప్పుడు రాక్షసులతో పోరాడిన షాట్స్ ఇవన్నీ చూపించారు. చివర్లో శ్రీ రాముడు పుష్పక విమానం ఎక్కే షాట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఆరోజుల్లోనే టెక్నాలజీ ఏ రేంజ్ లో ఉండేదో చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ నితీష్ తివారి. ఇది కేవలం శ్రీరాముడి ఎక్సక్లూసివ్ టీజర్ మాత్రమే , త్వరలో రావణుడు, హనుమంతుడు మరియు సీత దేవి లకు సంబంధించిన టీజర్స్ కూడా ఎక్సక్లూసివ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక శ్రీ రాముడిగా రణబీర్ కపూర్ పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనే చెప్పాలి.

శ్రీ రాముడి గా ఆయన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆరా ఫ్రేమింగ్ అద్భుతం. ఆరోజుల్లో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమో అని అనిపించేంత రేంజ్ లో ఉన్నాడు రణబీర్ కపూర్. మొబైల్ లో, టీవీ లలో చూస్తుంటేనే ఈ టీజర్ ఈ రేంజ్ లో ఉంది, ఇక వెండితెర పై చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందో, ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆత్రుత కలిగించేలా ఉంది ఈ టీజర్. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ రామాయణ్ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము , చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com