Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఎవరికి ఏదీ బెస్ట్ అంటే..

రెండు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఎవరికి ఏదీ బెస్ట్ అంటే..

Oktelugu.com 0 months ago

Tata Tiago EV vs MG Comet EV: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ఇప్పటికే ఆదరణ పొందని హ్యాచ్ బ్యాక్ కార్లు ఇప్పుడు EVగా మారి మార్కెట్లోకి వచ్చాయి.

వీటిలో టాటా టియాగో EV (Tata Tiago EV), ఎంజి కామెట్ EV (MG Comet EV) అనే రెండు కార్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందాయి. అయితే, వీటి డిజైన్, పనితీరు మరియు వినియోగం పూర్తిగా భిన్నమైనవి. వీటి మధ్య ప్రధాన వ్యత్యాసాలు మరియు పనితీరుపై ఉన్న తేడాలు ఏవీ? వీటిలో ఏది బెటర్?

డిజైన్:
Tata Tiago EV ఒక పూర్తి స్థాయి 5 డోర్ల హ్యాచ్‌బ్యాక్. ఇది సాధారణ కార్ల మాదిరిగానే ఉంటుంది. కాబట్టి కుటుంబ అవసరాలకు, హైవే ప్రయాణాలకు ఎక్కువ మంది ప్రయాణించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి మంచి బూట్ స్పేస్ కూడా ఉంది.
MG Comet EV ఒక చిన్నకాంపాక్ట్ సిటీ కారు. ఇది కేవలం నగరంలో రోజువారీ చిన్న ప్రయాణాల కోసం, ఆఫీసు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇరుకైన గల్లీల్లో సులభంగా నడపడానికి దీనిని రూపొందించబడింది. దీని చిన్న పరిమాణం వల్ల పార్కింగ్ సమస్యలు ఉండవు. కానీ ఇది కేవలం చిన్న కుటుంబాలకు లేదా సింగిల్ యూజర్లకు మాత్రమే అనువుగా ఉంటుంది.

బ్యాటరీ:
టాటా టియాగో EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో 19.2 నుంచి 24 కిలోవాట్ వరకు ఉంటుంది. ఈ బ్యాటరీ 75 హార్స్ పవర్ ను అందిస్తుంది. అలాగే ఈ బ్యాటరీకి DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 226 నుంచి 285 కిలోమటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
ఎంజి కామెట్ EVలో 17.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది సుమారు 230km రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ పరిమితంగా ఉంటుంది. టియాగోతో పోలిస్తే కామెట్ పవర్ తక్కువ. ఇది కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం.

ఫీచర్లు, భద్రత :
టాటా టియాగో EVలో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా టాటా కార్లకు మంచి గుర్తింపు ఉంది. ఇది పటిష్టమైన బాడీ బిల్డ్‌ను కలిగి ఉంటుంది.
ఎంజి కామెట్ EVలో కూడా డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు వాయిస్ కమాండ్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఇది చాలా ఆధునికంగా అనిపిస్తుంది, కానీ భద్రత మరియు స్థలం పరంగా టియాగో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

కుటుంబంతో కలిసి దూర ప్రయాణం చేయాలని అనుకుంటే ‘టాటా టియాగో EV’ ఉత్తమమైన ఎంపిక. కార్యాలయ అవసరాలకు ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి, తక్కువ ఖర్చుతో కూడిన చిన్న కారు కావాలనుకుంటే ‘ఎంజి కామెట్ EV’ని ఎంచుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com