Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Roja: రోజా ఏం నటిస్తున్నారు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

Roja: రోజా ఏం నటిస్తున్నారు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

Oktelugu.com 1 week ago

Roja: మాజీ మంత్రి రోజా పార్ట్ టైం పొలిటీషియన్ అయ్యారు. ప్రస్తుతం బుల్లితెర తో పాటు సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగుకు సంబంధించి బుల్లితెరలో..

సినిమాలకు సంబంధించి తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలే దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమె నటించిన తల్లి పాత్రకు సంబంధించిన సినిమా ఒకటి తమిళంలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయాన్ని దక్కించుకోలేదు. అయితే రోజా నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. దీంతో ఆమె మరో రెండు చిత్రాలకు సంబంధించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. క్రమేపి ఆమె తమిళ పరిశ్రమలో బిజీ నటిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం ఆమెకు సరైన అవకాశాలు దక్కడం లేదు. ఇక్కడ బుల్లితెరలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.

* పవన్,బాలకృష్ణ విషయంలో..
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు రోజా. అయితే గతంలో పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ విషయంలో రోజా చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేసిన వారు సినిమాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అప్పట్లో రోజా సినిమాల్లో నటించడం మానేశారు. బుల్లితెరకు సంబంధించి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. అలా బయటకు వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో నటించడం పై తప్పు పట్టారు. ఇప్పుడు అదే రోజా సినిమాల్లో నటిస్తున్నారు. టీవీ షోలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నెటిజెన్లు గతాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో చాలా మాటలు అన్నారని.. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

* తమిళ సినిమాల్లో రోజా బిజీ..
పవన్ కళ్యాణ్ నిజాయితీగానే రాజకీయాలు చేశారు. స్టార్ డం వదులుకొని మరి రాజకీయాల్లో నిలబడ్డారు. తన వృత్తి సినిమా రంగం అయితే.. ప్రవృత్తి రాజకీయం అని తేల్చి చెప్పారు. సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మునే రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నానని చెప్పారు. బాలకృష్ణ కూడా అంతే. ఓపిక ఉన్నంతకాలం నటిస్తానని.. తనకు నటించడం మాత్రమే తెలుసు అని నిక్కచ్చిగా చెబుతుంటారు. అయితే అటువంటి వారిని గతంలో రోజా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం రోజా నటిస్తున్నారు. అప్పట్లో మీద పడిపోయిన ఆమె ఇప్పుడు నటన విషయంలో సైలెంట్ గా పనిచేసుకుపోతున్నారు. అయితే మళ్లీ గ్లామర్ రంగంలో బిజీ అయితే వైసీపీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం ఉంది. మరి ఆ పని చేస్తారా? లేకపోతే అది కూడా నటనేనా? అన్నది తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com