Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజాపై కొత్త జంతువుల పేర్లతో షర్మిల దాడి.. రెడీగా ఉండాల్సిందే!

రోజాపై కొత్త జంతువుల పేర్లతో షర్మిల దాడి.. రెడీగా ఉండాల్సిందే!

Oktelugu.com 3 weeks ago

Roja Vs Sharmila: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు వివాదాస్పద అంశాల జోలికి వెళ్తూనే ఉంటారు. సాధారణంగా కుటుంబ వ్యవహారాలను నేతలు పెద్దగా ప్రస్తావించరు.

కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారంలో చాలామంది నేతలు మాట్లాడుతుంటారు. తాజాగా మహానాడులో ఇదే ప్రస్తావన వచ్చింది. గొడ్డలి పార్టీగా పేర్కొంటూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రస్తావిస్తూ నేతలు ఆరోపణలు చేశారు. అయితే వీటిని తిప్పి కొట్టే క్రమంలో మాజీ మంత్రి రోజా.. ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య ఘటన ఎవరి హయాంలో జరిగింది అంటూ లాజిక్ ప్రశ్న వేశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలు షర్మిలకు ప్రపంచంలో ఏ అన్న ఇవ్వని విధంగా భారీగా ఆస్తులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వారి మధ్య జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు. మధ్యలో విజయమ్మ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వివేకానంద రెడ్డి హత్య ఘటన చంద్రబాబు హయాంలో జరిగిందని.. ఆయనను నిలదీయాలని పిలుపునిచ్చారు.

* రాచమల్లు పై కుక్క అని ఆరోపణ..
మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డితో షర్మిల వివాదాన్ని ప్రస్తావించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రపంచంలోనే షర్మిల లాంటి సోదరి ఎవరికీ ఉండకూడదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న తనను మోసం చేసిన తీరుపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. తాను తన అన్న జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడుతుంటే.. కుక్కలతో మాట్లాడిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అవును తాము జగన్మోహన్ రెడ్డి అనే యజమానికి కుక్కలం అంటూ రాచమల్లు స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన షర్మిల వైసిపి నేతలను కుక్కలు అనవద్దు.. కుక్కలు కూడా బాధపడుతున్నాయి అంటూ సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేశారు.

* రోజాపై తప్పక రియాక్షన్..
ఇంత జరిగాక కూడా మాజీ మంత్రి రోజా ఇప్పుడు షర్మిల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దీంతో రోజాపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో అని ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కుక్క అని సంబోధించారు. ఇక కొత్త జంతువుల పేర్లను పెట్టి గట్టిగానే షర్మిల రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో తాను మోసపోయానని.. తన ఆస్తిని సైతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని.. ఆ కారణంతోనే ఆయనను విభేదించడం ప్రారంభించారు షర్మిల. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ చెల్లికి ఇవ్వనంత ఆస్తి.. షర్మిలకు ఇచ్చారంటూ రోజా వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. దీనిపై షర్మిల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఉండబోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com