Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రొటీన్ తాగుడు.. పరమ బోరు.. అందుకే ఇలా మారిపోయారు..

రొటీన్ తాగుడు.. పరమ బోరు.. అందుకే ఇలా మారిపోయారు..

Oktelugu.com 1 week ago

Flavoured Alcohol Trends: టమాట కూర అంటే మనలో చాలామందికి ఇష్టం. అలాగని రోజు టమాటా కూర పెడితే తినడం చాలా కష్టం. కొంతమంది మాంసాహారాన్ని విపరీతంగా తింటుంటారు.

ప్రతిరోజు దాన్నే పెడితే విసిరి కొడతారు. ఏదైనా సరే ఒక స్థాయి వరకు బాగుంటుంది. అదే అదే రిపీట్ అవుతుంటే చిరాకు లేస్తూ ఉంటుంది. అందుకే మనుషులు అన్నాక కళాపోషణ ఉండాలి అన్నారు వెనుకటికి రావు గోపాల్ రావు గారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు మద్యం తయారు చేసే కంపెనీలు పాటిస్తున్నాయి.

మధ్యలో అనేక రకాల బ్రాండ్లు ఉన్నాయి. కొందరు బ్రాందీ తాగుతారు. ఇంకొందరు విస్కీ తాగుతారు. మరికొందరు జిన్, రమ్ము, బీర్లు, స్కాచ్, వోడ్కా వంటివి తాగి మత్తులో తూలుతుంటారు. కొంతమందికి తాగడం అనేది ఒక వ్యసనం. అదేదో గొప్ప పని మేం చెప్పడం లేదు గాని.. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మడమే. ప్రభుత్వాలు నడవాలంటే.. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా మద్యం అమ్మాల్సిందే. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు తప్పడం లేదు. పైగా ప్రభుత్వాలే ఏటికేడు మద్యం షాపుల ధరలు పెంచేస్తున్నాయి. మద్యం ధరలు కూడా అడ్డగోలుగా హైక్ చేస్తున్నాయి.

మద్యం దందాలో ఉన్న కంపెనీలు ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నాయి. వినియోగదారులకు రకరకాల ప్లేవర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్రెడిషనల్ ఆల్కహాల్ పట్ల యువత ఆసక్తి చూపించకపోవడంతో.. కంపెనీలు రకరకాల ఫ్లేవర్లను అందుబాటులో తీసుకొచ్చాయి. ఇందులో కూడా కూల్ డ్రింక్స్ ప్లేయర్లను కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

మింట్, జామున్, మ్యాంగో వంటి రుచులను ఆల్కహాల్ కంపెనీలు యాడ్ చేస్తున్నాయి. ఇలాంటి ఫ్లైఓవర్లు ఎక్కువగా వోడ్కా కంపెనీలు తయారు చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొంది.. “గతంలో ఫ్లేవర్ లిక్కర్ ను విదేశీ వ్యక్తులు మాత్రమే తాగేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి భారత్ లోకి కూడా వచ్చింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో సిటీస్లలో ఇప్పుడు ఈ ఫ్లేవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత మిగతా నగరాలలో కూడా అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. మ్యాజిక్ మూమెంట్స్ అనే కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో తన అమ్మకాలను ఏకంగా 21 శాతం పెంచుకుంది. దీనిని బట్టి ఫ్లేవర్ మద్యాన్ని జనం ఎలా ఆస్వాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని” జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.

ఎలాంటి బ్రాండ్ అయినా సరే మద్యం అనేది ఘాటుగా ఉంటుంది. కానీ ఆ ఘాటు వాసనను చాలామంది తట్టుకోలేకపోతున్నారు. కొన్నిచోట్ల మద్యం విక్రయాలు పడిపోవడం కంపెనీలను ఆలోచింపజేసింది. ఆ తర్వాత వినియోగదారుల అభిప్రాయాలను కంపెనీలు తెలుసుకున్నాయి. ఫలితంగా ఫ్లేవర్లను పూర్తిగా మార్చేశాయి. అందువల్లే ఇలాంటి మ్యాంగో, మింట్, జామున్ వంటి రకాలను తీసుకొచ్చాయి. దీనివల్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు కూల్ డ్రింక్స్ మాత్రమే ఈ స్థాయిలో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మద్యంలో కూడా ఇటువంటి ఫ్లేవర్లను అందుబాటులోకి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com