Dailyhunt
సల్మాన్ ఖాన్ ను భయపెడుతున్న తెలుగు స్టార్ హీరోలు...కారణం ఇదే....

సల్మాన్ ఖాన్ ను భయపెడుతున్న తెలుగు స్టార్ హీరోలు...కారణం ఇదే....

Oktelugu.com 1 week ago

Salman Khan: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలందరు టాప్ హీరోలుగా మారుతున్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం వాళ్ళ మార్కెట్ ని పూర్తిగా కోల్పోతున్నారు.

ఖాన్ త్రయం లో ఒకరిగా గుర్తింపును సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ సైతం ఈ మధ్యకాలంలో అసలు సక్సెస్ లను సాధించడం లేదు. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా నిరాశ పరుస్తున్నాయి. దాంతో ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రొటీన్ సినిమాలు చేస్తారనే పేరున్న వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు. తనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసి పెడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి సక్సెస్ లను సాధించి పెట్టిన కూడా సల్మాన్ ఖాన్ కి మన తెలుగు డైరెక్టర్స్ ఎవరు సక్సెస్ ఇవ్వలేదు. కాబట్టి వంశీ పైడిపల్లి అతనికి సక్సెస్ సాధించి పెడితే మాత్రం తెలుగు డైరెక్టర్లలో సల్మాన్ ఖాన్ కి మొదటి సక్సెస్ ని అందించిన దర్శకుడిగా వంశీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన వాడవుతాడు.

ఇక ఏది ఏమైన కూడా వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలను పక్కనపెట్టి ఇతర భాషలో హీరోల వైపే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన తమిళ స్టార్ హీరో అయిన విజయ్ తో వారసుడు అనే సినిమా చేశాడు. ఆ మూవీ ఆశించిన మేరకు విజయం సాధించలేదు.

ఇక సల్మాన్ ఖాన్ తో చేస్తున్న ఈ సినిమా అయిన అతనికి మంచి విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడం వెనక కారణం ఏంటి అంటూ మరికొంతమంది సినిమా విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు…

ఇక మన తెలుగు హీరోలను చూసి సల్మాన్ ఖాన్ సైతం భయపడుతున్నారట. కారణమేంటంటే మన వాళ్ళ లాగా సూపర్ సక్సెస్ లను సాధించే కెపాసిటి తనకు ఉందా? తన మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందా? అనే ఒక డైలామాలో తను ఉన్నాడు. ఒకవేళ అతని సినిమా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయకపోతే అది అతనికి ఒక అవమానంగా భావించే అవకాశం కూడా ఉంది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com