Dailyhunt
సమంత భర్త ఊర మాస్ ప్లానింగ్.. సూపర్ హీరో గా సల్మాన్ ఖాన్..

సమంత భర్త ఊర మాస్ ప్లానింగ్.. సూపర్ హీరో గా సల్మాన్ ఖాన్..

Oktelugu.com 1 week ago

Raj Nidimoru: సమంత(Samantha Ruth Prabhu) రెండవ భర్త రాజ్ నిడిమోరు(Raj Nidimoru) బాలీవుడ్ లో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ , నిర్మాత అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

దేశం మొత్తం ఎంతగానో ఇష్టపడే వెబ్ సిరీస్ లలో ఒకటి ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ఇప్పటి వరకు మూడు సీజన్స్ వచ్చాయి, మూడిట్లో రెండిటికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెండవ సీజన్ లో సమంత ని ఆయన ఎంతటి క్రూరమైన విలన్ గా చూపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ తో పాటు ఆయన షాహిద్ కపూర్ తో ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ కూడా చేసాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇండియా లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సిరీస్ గా నిల్చింది. అంతే కాకుండా సమంత తో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసాడు, ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది.

ఇలా ఇంత కాలం తన టాలెంట్ ని కేవలం ఓటీటీ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం చేసిన రాజ్ & డీకే, ఇప్పుడు వెండితెర ద్వారా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డాడు. అది కూడా చిన్నా చితకా హీరోతో ఆయన వెండితెర అరంగేట్రం చేయడం లేదు , ఏకంగా బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ తో తన మొదటి చిత్రం చేస్తున్నాడు. సల్మాన్ ని ఇందులో ఆయన ఒక సూపర్ హీరో గా చూపించబోతున్నాడు అట. రీసెంట్ గానే సల్మాన్ ని కలిసి ఈ సూపర్ హీరో స్టోరీ ని వినిపించగా, ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది , వెంటనే షూటింగ్ ని మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. అక్టోబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రం తో పాటు సల్మాన్ ఖాన్ రీసెంట్ గానే దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే మొదలయ్యాయి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజ్ & డీకే లతో సూపర్ హీరో స్టోరీ సినిమాని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఇందులో హీరోయిన్ గా సమంత నే నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సల్మాన్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు రాబోయే చిత్రాలతో భారీ లెవెల్లో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు , మరి ఆయన ఆకాంక్ష నెరవేరుద్ధో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com