Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sardar 2 Teaser Review: 'సర్దార్ 2' మూవీ టీజర్ రివ్యూ : విజువల్స్ ఒకే.స్టోరీ విషయం ఏంటి..?

Sardar 2 Teaser Review: 'సర్దార్ 2' మూవీ టీజర్ రివ్యూ : విజువల్స్ ఒకే.స్టోరీ విషయం ఏంటి..?

Oktelugu.com 1 week ago

Sardar 2 Teaser Review: తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన 'సర్దార్ 2' సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించడానికి సిద్ధమవుతోంది.

ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్ తో ఉండడమే కాకుండా ఇందులో కార్తీ తండ్రిగా, కొడుకుగా నటిస్తూ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ను కూడా తెలియజేశారు. ఎస్ జె సూర్య వాయిస్ ఓవర్ తో తను తాను పరిచయం చేసుకుంటూ కార్తీ రెండు క్యారెక్టర్ లను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ కథలో మంచి హీరోలు గెలుస్తారా? చెడ్డ విలన్ గెలుస్తాడా అంటూ అతను అడిగిన ప్రశ్నకి సమాధానమే ఈ సినిమాగా మనకు తెలుస్తుంది. కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ అయితే కనిపించడం లేదు. ఇక ఏదేమైనా కూడా కార్తీ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించింది. దానికి తగ్గట్టుగానే ‘సర్దార్ 2’ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తే చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు.

వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందా? ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదిలా ఉంటే ఎస్ జే సూర్య విలనిజం కూడా ఈ సినిమాకి హైలైట్ అవ్వబోతున్నట్టుగా టీజర్ ను చూస్తే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎస్ జే సూర్య చేసిన ప్రతి పాత్ర తనకి ఒక గొప్ప ఐడెంటిటి ని తీసుకొస్తుంది.

కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలోని పాత్రలు కూడా ఆయనకి నెక్స్ట్ లెవెల్ గుర్తింపును తీసుకొచ్చి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com