Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Senior Journalists : తెలుగులో మరో మీడియా సంస్థ.. ఎన్ఆర్ఐ ల నుంచి ఆ మాజీ ఎడిటర్లకు డబ్బులు

Senior Journalists : తెలుగులో మరో మీడియా సంస్థ.. ఎన్ఆర్ఐ ల నుంచి ఆ మాజీ ఎడిటర్లకు డబ్బులు

Oktelugu.com 5 days ago

Senior Journalists : వారిద్దరూ సీనియర్ జర్నలిస్టులు. లెఫ్ట్ భావజాలాన్ని కలిగి ఉంటారు. ఇప్పటికీ కేంద్రం మీద.. నరేంద్ర మోడీ మీద విషం చిమ్ముతూనే ఉంటారు.

వారిద్దరూ సోషల్ మీడియాలో ఎరుపు భావజాలాన్ని ప్రదర్శిస్తుంటారు.

వారిద్దరు సీనియర్ జర్నలిస్టులు మాత్రమే కాదు.. గతంలో తెలుగులో ప్రధాన పత్రికలుగా ఉన్నవాటిలో పనిచేశారు. వాటికి సంపాదకులుగా కూడా వ్యవహరించారు. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా రాసేవారు. తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పేవారు. అనేక ఉద్యమాలలో వారి ప్రాతినిధ్యం ఉంది. ఓ పొలిటికల్ పార్టీతో వారిద్దరికీ గట్టి రిలేషన్ ఉందని ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేసే విధంగా అనేక కార్యక్రమాలకు వారిద్దరు హాజరయ్యారు.

ఏజ్ బార్ కావడంతో వారిద్దరు పనిచేస్తున్న పేపర్లకు సంబంధించి సంపాదకీయ బాధ్యతకు దూరం జరిగారు. కొంతకాలం పాటు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా.. కాలమిస్టులుగా పని చేశారు. ఇప్పుడు వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాల్సి వచ్చింది. ఏ మీడియాలో అయితే వారిద్దరు సీనియర్ పాత్రికేయులుగా.. సంపాదకులుగా పనిచేశారో.. ఇప్పుడు అదే మీడియాలో ప్రయోగాలు మొదలుపెట్టారు. డిజిటల్ విధానంలో పత్రికను.. ఛానల్ ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఏ మీడియా వ్యవస్థ అయినా సరే డబ్బులు కావాలి. అందులో పని చేసే వారికి జీతాలు ఇవ్వాలి. అందువల్లే ఆ ఇద్దరు సంపాదకులు ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే వారిద్దరి ప్రయత్నానికి ఎన్నారై లు తమ వంతు సహాయం చేయడం మొదలుపెట్టారు. విదేశాల నుంచి డబ్బులు పంపిస్తున్నారు. మాదాపూర్ ప్రాంతంలో ఒక ఖరీదైన ఏరియాలో ఈ ఇద్దరు మాజీ ఎడిటర్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అక్కడినుంచే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీరిద్దరిది ఎరుపు భావజాలం కాబట్టి.. ఆ దిశగానే కార్యాలపాలు వేగవంతమయ్యాయి అని తెలుస్తోంది. గతంలో వీరి ఆధ్వర్యంలో పనిచేసినవారు.. వీరికి పరిచయం ఉన్నవారు అంత ఆ సంస్థలో చేరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి తెలుగులో మరో మీడియా సంస్థ రాబోతోంది. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ.. మాజీ సంపాదకులుగా ఉన్నప్పటికీ.. వీరి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు నెలకు 30 వేలకు నుంచి ఇవ్వకపోవడం విశేషం. అంతేకాదు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేమని.. ఎప్పుడైనా ఆర్థిక అంతరాలు ఏర్పడితే సంస్థను మూసివేసే అవకాశం కూడా ఉందని ముందే చెబుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం లేస్తే విలువల గురించి.. హక్కుల గురించి మాట్లాడే ఈ ఇద్దరు మాజీ ఎడిటర్లు.. ఇలా జీతం విషయంలో.. సౌకర్యాల విషయంలో పక్కా సామ్రాజ్యవాదులుగా వ్యవహరించడం నిజంగా హాస్యాస్పదం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com