Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శక్తివంతమైన కిరిన్ 9010S ప్రాసెసర్ తో మార్కెట్లోకి కొత్త ఫోన్లు..

శక్తివంతమైన కిరిన్ 9010S ప్రాసెసర్ తో మార్కెట్లోకి కొత్త ఫోన్లు..

Oktelugu.com 3 weeks ago

Huawei Nova 16 Pro specifications: ఇప్పుడున్న వారు కొత్తగా ఫోన్ కొనాలంటే డిస్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా అద్భుతమైన డిస్ ప్లేను అందించడానికి కొత్త డివైజ్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

ఇందులో భాగంగా హువావే (Huawei) కంపెనీ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘నోవా 16’ని చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో భాగంగా ‘నోవా 16 ప్రో’, ‘నోవా 16 అల్ట్రా’ మోడల్స్ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Nova 16 Pro, Nova 16 Ultra అనే రెండు ఫోన్లు 6.84 అంగుళాల భారీ LTPO OLED డిస్‌ప్లేతో వస్తున్నాయి. ఇవి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటమే కాకుండా.. 2856 x 1320 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. స్క్రీన్ రక్షణ కోసం ఇందులో ‘కున్లున్ గ్లాస్’ను వాడారు. అల్ట్రా మోడల్ మరింత మన్నికైన నిర్మాణంతో వస్తోంది. ప్రో మోడల్ IP65 రేటింగ్‌ తో ఉండడంతో పాటు అల్ట్రా మోడల్ అత్యున్నతమైన IP68 రేటింగ్ ను కలిగి ఉంటుంది. దీంతో ఇవి రెండు కూడా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు హువావేకి చెందిన శక్తివంతమైన ‘కిరిన్ 9010S’ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి హువావే స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ ‘హార్మొనీ OS 6.1’ పై రన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ తో పాటు గేమింగ్ కోసం ఇందులో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ మరియు ఏఐ ఫీచర్లను జోడించారు. ఇవి 256GB, 512GB మరియు 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

కెమెరా విభాగంలో ఈ ఫోన్లు అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తాయి. రెండు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా తో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చారు. వీటికి అదనంగా ఫోటోలను మెరుగుపరిచేందుకు ‘రెడ్ మ్యాపుల్’ కలర్ సెన్సార్లను కూడా హువావే పొందుపరిచింది.

ఈ సిరీస్ ప్రత్యేకత 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. ఇవి 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌లో 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. రెండు ఫోన్లు వై-ఫై 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ చేస్తాయి. అల్ట్రా మోడల్‌లో శాటిలైట్ కాలింగ్ ఫీచర్ ఉండగా, ప్రో మోడల్ టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com