Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శేఖర్ కమ్ముల ఆ రెండు సినిమాలు తీసి తప్పు చేశాడా...కారణమేంటంటే...

శేఖర్ కమ్ముల ఆ రెండు సినిమాలు తీసి తప్పు చేశాడా...కారణమేంటంటే...

Oktelugu.com 3 weeks ago

Sekhar Kammula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కొత్త ఒరవడిని సృష్టించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి.

ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. ముఖ్యంగా ఆనంద్, గోదావరి లాంటి సినిమాలు అతని కెరియర్ లో క్లాసికల్ సినిమాలుగా నిలిచిపోయాయి. ఇక హ్యాపీ డేస్ సినిమాను చూసి చాలా మంది కుర్రాళ్ళు బీటెక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇంజినీరింగ్ కాలేజీలో చేరారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు తడబడుతున్నాడు…

గత సంవత్సరం ‘కుబేర’ సినిమాతో యావరేజ్ సక్సెస్ ని మూట గట్టుకున్న ఆయన మరోసారి భారీ విజయాన్ని సాధించే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నాడు. తన ఎంటైర్ కెరియర్ లో ఆయన చేసిన సినిమాలు కొన్ని అతన్ని విపరీతంగా నిరాశపర్చాయి. అయితే ఆ సినిమాలను చేయకుండా ఉంటే బాగుండేది అంటూ శేఖర్ కమ్ముల రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రియలైజ్ అయ్యాడు.

ఇంతకీ ఆయన ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నాడంటే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, అలాగే నయనతార ను మెయిన్ లీడ్ లో పెట్టి చేసిన ‘ అనామిక ‘ సినిమా కావడం విశేషం… అయితే ఈ రెండు సినిమాలను తను కాలిక్యులేట్ చేయడంలో చాలావరకు ఫెయిల్ అయ్యానని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు.

కానీ ఆయన దర్శకత్వంలో ఆ రెండు సినిమాలు వచ్చాయంటే మాత్రం ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆ రెండు సినిమాలు అతని మార్కును ఏమాత్రం చూపించకపోవడమే కాకుండా ప్రేక్షకులందరిని విపరీతంగా నిరాశపరిచాయి… చూడాలి మరి ఫ్యూచర్ లో శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమాలు చేస్తాడు… ప్రేక్షకులను ఎలా మెప్పిసాడు అనేది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com