Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Smoking Before Bed: పడుకునేముందు సిగరెట్ తాగితే జరిగేది ఇదే..

Smoking Before Bed: పడుకునేముందు సిగరెట్ తాగితే జరిగేది ఇదే..

Oktelugu.com 1 day ago

Smoking Before Bed: మానసిక ప్రశాంతత కోసం.. మానసిక ఉల్లాసం కోసం.. సిగరెట్ తాగాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ఇది ఒక వ్యసనం అయినా కూడా తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తున్నందున దీనికి బానిస అయిన వారు చాలామంది ఉన్నారు.

అయితే ధూమపానం వల్ల కొంతమంది ఇప్పటికీ అనారోగ్యానికి గురయ్యారు. మరికొందరు తమకి ఏం కాదులే అన్నట్లు ఉంటున్నారు.. ఏది ఏమైనా కొందరు సిగరెట్లు ప్రత్యేక పరిస్థితుల్లో తాగుతూ ఉంటారు. ఉదయం లేవగానే.. రాత్రి నిద్రపోయే ముందు సిగరెట్ తాగుతారు. అయితే రాత్రి పడుకునే ముందు సిగరెట్ తాగితే జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకుందాం..

మనసు డిస్టర్బ్ అయినప్పుడు సిగరెట్ తాగేవారు చాలామంది ఉంటారు. అంటే ఇలాంటి సమయంలో ధూమపానం వల్ల బ్లడ్ ప్రెషర్ రేట్లు తగ్గించి మనసును ప్రశాంతంగా చేస్తుందని చాలామంది భావన. ఇదే పద్ధతిని నిద్రపోయే ముందు కూడా పాటిస్తారు. అంటే పడుకునే ముందు సిగరెట్ తాగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. కానీ సిగరెట్ లో ఉండే నికోటిన్ పదార్థం మనసును ఉత్తేజపరుస్తుంది. దీంతో ఎలాంటి నిద్ర రాకుండా ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు సిగరెట్ తాగడం వల్ల వెంటనే జారుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మనసు ఉల్లాసంగా ఉండి నిద్రమత్తు కలగదు. ఇలా గంటల తరబడి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా నిద్ర పోయినా కూడా పదేపదే మెలకువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పోకుండా మనసు కలతగా ఉంటుంది. ఇలా ఉన్నవారు ఉదయం లేచిన తర్వాత ఆందోళనగా కనిపిస్తారు.

రాత్రి పడుకునే ముందు సిగరెట్ తాగిన వారు ఉదయం అలసటగా కనిపిస్తారు. ఎందుకంటే వీరు రాత్రంతా నిద్రపోయినట్టు కనిపించిన గాఢ నిద్ర మాత్రం పట్టే అవకాశం ఉండదు. ఫలితంగా ఉదయం అలసటగా కనిపించి ఏకాగ్రత తగ్గిపోతుంది. అందువల్ల నిద్ర బాగా రావడానికి సిగరెట్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ధూమపానం వల్ల కేవలం నిద్ర సమస్య మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్య, గుండెపోటు వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సిగరెట్ తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం పొందామని చాలామంది భావిస్తారు. కానీ దీర్ఘకాలికంగా ఇది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఇప్పటికైనా సిగరెట్కు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com