Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పిరిట్ లో ప్రభాస్ బ్రదర్ గా సందీప్ రెడ్డి వంగ కనిపించబోతున్నాడా.. ఇక రచ్చ రచ్చే..

స్పిరిట్ లో ప్రభాస్ బ్రదర్ గా సందీప్ రెడ్డి వంగ కనిపించబోతున్నాడా.. ఇక రచ్చ రచ్చే..

Oktelugu.com 4 months ago

Spirit movie Prabhas brother role: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రభాస్ లాంటి నటుడు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయాలని 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాస్ ఇద్దరు చాలా కసిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉందట. ప్రభాస్ బ్రదర్ గా నటించే ఒక పాత్రలో సందీప్ రెడ్డివంగా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి సందీప్ రెడ్డివంగా ను చూడగానే ఒక రఘుడ్ లుక్ తో, బేస్ వాయిస్తూ వేసుకొని ఉంటాడు కాబట్టి ఆయన మాటలకే చాలా మంది భయ పడిపోతుంటారు.

మరి అలాంటి ఒక వ్యక్తి ఈ సినిమాలో చిన్న నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది.

ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన చాలా వరకు క్లారిటిని మైంటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి…ఈ సినిమాలో సందీప్ నటిస్తే నిజంగానే అదొక వండర్ గా నిలిచిపోతుంది.

నిజానికి ఆయన చాలా మంచి నటుడని ఆయనతో వర్క్ చేసిన చాలా మంది చెబుతుంటారు. కానీ స్క్రీన్ మీద మనం ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ప్రభాస్ పక్కన మనం ఆయన్ని చూసినట్లయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com