Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'స్పిరిట్' సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కి అంత రెడీ...ప్రభాస్ చేస్తాడా...డూప్ చేస్తాడా...

'స్పిరిట్' సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కి అంత రెడీ...ప్రభాస్ చేస్తాడా...డూప్ చేస్తాడా...

Oktelugu.com 3 weeks ago

Prabhas Spirit movie action scenes: అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది.

అనిమల్ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా విషయంలోను చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. స్పిరిట్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట. నిజానికి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా కొత్తగా చూపించబోతున్నాడట. ఈ మధ్యకాలంలో ప్రభాస్. సలార్ ను మినహాయిస్తే ఏ సినిమాలో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనలేదు. తన నుంచి అలాంటి సినిమాలి వస్తె చూడాలని చాలా మంది. అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికైతే సందీప్ ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చే విధంగా కనిపిస్తున్నాడు…ఈనెల 7వ తేదీ నుంచి ఈ ఫైట్ కి సంబంధించిన రిహార్సల్స్ ను చేయబోతున్నారట.

అలాగే ఈనెల చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. సందీప్ రెడ్డి వంగ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి చాలా పెద్ద పీట వేస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఆయన చేసిన అనిమల్ సినిమా విషయంలో కూడా యాక్షన్స్ చాలా వరకు సూపర్ గా తీర్చిదిద్దాడు…

ఇప్పుడు అలాగే స్పిరిట్ సినిమాలో కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా? లేదంటే డూప్ తో చేయిస్తారా అంటూ కొంతమంది అభిమానులు సైతం సోషల్ మీడియాలో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సలార్ సినిమాలో చాలావరకు డూప్ ను వాడుకున్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయంలో కూడా అలానే చేస్తారా? లేదంటే డైరెక్ట్ గా ప్రభాస్ పాల్గొంటాడా అనేది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఆరోగ్యం అంత బాగుండడం లేదు. దానికి తోడుగా ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటే ఆయనకి ఏదైనా గాయమైతే షూటింగ్ మరింత లేటవ్వచ్చు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… మొత్తానికైతే రిస్క్ లేని షాట్స్ ప్రభాస్ చేస్తే రిస్కీ తో కూడిన షాట్స్ లో డూప్ చేయబోతున్నాడట….

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com