Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sreemukhi: శ్రీముఖి పేరుని తన నుదిటిపై 'టాటూ' వేయించుకున్న 'గుండెనిండా గుడిగంటలు' హీరో బాలు.. వీడియో వైరల్!

Sreemukhi: శ్రీముఖి పేరుని తన నుదిటిపై 'టాటూ' వేయించుకున్న 'గుండెనిండా గుడిగంటలు' హీరో బాలు.. వీడియో వైరల్!

Oktelugu.com 1 week ago

Sreemukhi: ప్రతీ ఆదివారం స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కామెడీ షోకి ఆడియన్స్ లో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.రీసెంట్ గానే 200 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది ఈ బిగ్గెస్ట్ కామెడీ షో.

యాంకర్ శ్రీముఖి అవినాష్, హరిలతో కలిసి టీవీ సీరియల్ ఆర్టిస్టులతో చేసే సరదా ప్రేక్షకుల చేత పొట్టచెక్కలు అయ్యేలా నవ్విస్తూ ఉంటుంది. గత వారం 200 వ ఎపిసోడ్ ని ఎంత గ్రాండ్ గా చేశారో అందరికీ తెలిసిందే. ఆడియన్స్ కి గంటపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు. ముఖ్యంగా హరి తన కాబోయే భార్య సీరియల్ హీరోయిన్ దీపికా అనే విషయాన్ని రివీల్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఇది కాసేపు పక్కన పెడితే ఈ వారం జరగబోయే ఎపిసోడ్ లో ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన కొన్ని సందర్భాలను స్పూఫ్ చేస్తూ ఒక స్కిట్ చేశారు. గతం లో ‘అగ్ని పరీక్ష 1’ ని కూడా , ఇదే షో లో స్పూఫ్ చేశారు మేకర్స్. ఈ స్పూఫ్ కి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రేంజ్ లోనే ఇప్పుడు కూడా ప్లాన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘అగ్ని పరీక్ష 2’ లో ‘నవరసాల మామ’ అలియాస్ రామ కృష్ణ ‘తు నా బ్రతుకు’ అని చేతిపై పచ్చ బొట్టు వేయించుకోవడం ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సందర్భాన్ని స్పూఫ్ చేస్తూ ‘గుండెనిండా గుడి గంటలు’ హీరో బాలు కి ఎక్స్ ప్రెస్ హరి ఒక టాస్క్ ఇస్తూ ‘నీ నుదిటిపై శ్రీముఖి అని టాటూ వేయించుకోవాలి’ అంటాడు. ఆ మాట అనగానే శ్రీముఖి సిగ్గుపడుతుంది. మరి బాలు తన నుదిటిపై ‘శ్రీముఖి’ పేరు ని టాటూ వేయించుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఈ షో లో శ్రీముఖి ‘గుండెనిండా గుడి గంటలు’ సీరియల్ హీరో విష్ణు అలియాస్ బాలు కి లైన్ ఎయ్యడం, అతనితో ఒక సెపెరేట్ లవ్ ట్రాక్ ని క్రియేట్ చేసి ఇప్పటికీ నడుపుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా బాలు ప్రతీ ఎపిసోడ్ లో కనిపిస్తూనే ఉంటాడు. శ్రీముఖి తో ఆయనకు ఈ షో ద్వారా మంచి కనెక్షన్ ఏర్పడింది. ఒక ఈవెంట్ లో అయితే స్వయంగా శ్రీముఖి కోసం చీర ని తన చేతులతో తయారు చేసి తీసుకొస్తాడు. ఆ ఎపిసోడ్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అయితే వీళ్లది కేవలం ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ మాత్రమే, బయట మాములే అనే విషయాన్ని గ్రహించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com