Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా మిస్ అవ్వడానికి కారణం ఎవరు...

సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా మిస్ అవ్వడానికి కారణం ఎవరు...

Oktelugu.com 1 week ago

Sukumar Vijay Deverakonda combo: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు ఒక్కో పంథా ను అనుసరిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

సుకుమార్ లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్లు సైతం డిఫరెంట్ తరహా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆయన చేసిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని సైతం కట్టబెట్టిన ఘనత తనకే దక్కుతుంది… రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటూ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత పుష్ప సినిమాతో బిజీ అయిపోయిన సుకుమార్ రెండు పార్టీలకు కలిపి దాదాపు నాలుగు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడు. రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ తో చేయాల్సిన ప్రాజెక్టు ఎందుకు క్యాన్సిల్ అయింది.

ఎందుకని కాన్సిల్ అవ్వాల్సి వచ్చింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కోసం అనుకున్న కాన్సెప్ట్ తోనే రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ కొంతమంది చెబుతుంటే ప్రస్తుతం సుకుమార్ కి ఉన్న మార్కెట్ విజయ్ దేవరకొండకు ఉన్న మార్కెట్ వేరు…

కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరే అవకాశాలు లేవు. టైర్ వన్ హీరోలతో మాత్రమే సుకుమార్ సినిమా చేయగలిగితే ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ అవుతాయి అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేస్తే ఆ సినిమా పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేయకపోవచ్చనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ మరోసారి రామ్ చరణ్ వైపు అడుగులు వేస్తున్నాడు.

అందుకే విజయ్ దేవరకొండ ను పక్కన పెట్టాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమా చేస్తున్నాడు. రవి కిరణ్ దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల మీద కూడా భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలతో టాప్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com