Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sweets : చివరికి ఆ స్వీట్ హౌస్ కూడా.. ఇలాగైతే స్వీట్లు ఏం కొంటాం.. వైరల్ వీడియో

Sweets : చివరికి ఆ స్వీట్ హౌస్ కూడా.. ఇలాగైతే స్వీట్లు ఏం కొంటాం.. వైరల్ వీడియో

Oktelugu.com 2 weeks ago

Pulla Reddy Sweets : మన దేశంలో కొన్ని కంపెనీలకు విపరీతమైన బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఆ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులలో నాణ్యత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తూ ఉంటారు.

కొనుగోళ్లు అధికంగా ఉంటే ఆ కంపెనీ విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక మనదేశంలో ఇటువంటి కంపెనీలు చాలానే ఉన్నాయి.

ఉదాహరణకు స్టీల్ విషయంలో టాటాకు తిరుగు ఉండదు. ఇనపరేకుల విషయంలో కూడా టాటా కంపెనీకి పోటీ సంస్థ ఉండదు. టెలికాం విషయంలో ఎయిర్టెల్.. దుస్తుల విషయంలో రేమండ్.. ఇక ఫుడ్ విషయానికొస్తే.. ముఖ్యంగా స్వీట్ల ప్రస్తావన వస్తే పుల్లారెడ్డి.. ఇలా కొన్ని కంపెనీలకు అపరిమితమైన బ్రాండ్ వేల్యూ ఉంది. కానీ ఆ బ్రాండ్ ఇప్పుడు లేదని.. క్వాలిటీ విషయంలో కంపెనీలు సరిగా వ్యవహరించడం లేదని అధికారుల తనిఖీలలో తేలింది.

హైదరాబాద్ నగరంలో పేరుపొందిన స్వీట్ షాపులు చాలా ఉన్నాయి. ఇందులో పుల్లారెడ్డి స్వీట్ షాప్ కూడా ఒకటి. కొన్ని తరాలుగా పుల్లారెడ్డి స్వీట్ షాప్ ను నిర్వహిస్తూ ఉన్నారు. పుల్లారెడ్డి స్వీట్ షాపులో రకరకాల వెరైటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా అత్యంత క్వాలిటీ గా ఉంటాయి. పుల్లారెడ్డి స్వీట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఇతర దేశాలకు కూడా ఉంటాయి. పుల్లారెడ్డి స్వీట్స్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.

కొంతకాలంగా పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ మీద ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలోని పుల్లారెడ్డి తోపాటు మరో 31 స్వీట్ షాపులు.. యూనిట్ల మీద అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో అపరిశుభ్రమైన వాతావరణం.. గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. సరైన స్థాయిలో లేని నిల్వ.. సక్రమంగా లేని నిర్వహణ.. బూజు పట్టి పాడైపోయిన కూరగాయలు.. ఎఫ్ఎస్ఎస్ లేబులింగ్.. ప్యాకేజింగ్.. డిస్ప్లే నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.

స్వీట్ షాప్ లకు సంబంధించిన పలు యూనిట్లలో తప్పు తోవ పట్టించే విధంగా వాదనలు.. ప్రకటనలు ఉండడంతో అధికారులు వాటిని తీవ్రంగా పరిగణించారు. పలు షాపులు తయారు చేస్తున్న ఉత్పత్తులలో కీటకాలు కనిపించాయి. ఎలుకల బెడద కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా బాచుపల్లి ప్రాంతంలోని బర్ఫీ ఘర్ లైసెన్సును రద్దు చేస్తూ.. అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com