Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పు సహజం.. కానీ అలా సరిదిద్దుకున్న అలీ

తప్పు సహజం.. కానీ అలా సరిదిద్దుకున్న అలీ

Oktelugu.com 1 week ago

Ali Apology: ఇటీవల ప్రముఖ కమెడియన్ అలీ క్షమాపణలు చెప్పారు. ఓ సబ్బుల కంపెనీకి ఇచ్చిన యాడ్ పై అభ్యంతరాలు రావడంతో ముందే మేల్కొన్నారు అలీ. దాదాపు 1000 చిత్రాల్లో నటించారు.

ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. బుల్లితెరలో చాలా షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ అభ్యంతరకర యాడ్ లో నటించడం విమర్శలకు గురయ్యారు. వెంటనే పరిస్థితిని గమనించి అలీ క్షమాపణలు చెప్పడం విశేషం. నిజంగా అభినందించదగ్గ విషయం కూడా.

* సబ్బుల కంపెనీ ప్రకటనలో..
ముంబాయికి చెందిన ఓ సబ్బుల కంపెనీ.. తన ప్రకటనకు గాను అలీని సంప్రదించింది. ఆ యాడ్లో సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు అలీ. అయితే లక్ష్మీదేవి పూజ మాదిరిగా ఆ సబ్బును పెట్టి అలీ పూజిస్తుంటారు. అయితే ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది లక్ష్మీదేవి పూజను విమర్శించినట్టేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే దాదాపు 1000 చిత్రాల్లో నటించిన సీనియారిటీ అలీ ది. ఇటువంటి విమర్శలు వస్తాయని ఆయన భావించలేదు. ఆ విమర్శలు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు అలీ. ఎంత మాత్రం బేషజాలాలకు పోకుండా వెంటనే క్షమాపణలు చెప్పారు. సదరు బొంబాయి కంపెనీ తో మాట్లాడి ఆ ప్రకటనను నిలిపివేయించారు.

* సోషల్ మీడియా పుణ్యమా అని..
ప్రస్తుతం సమాజంలో మతవాదం పెరుగుతోంది అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రధానంగా హిందుత్వవాదం పెరిగింది. అయితే గతంలో మతాల మాటున స్వేచ్ఛ ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని మత రక్షకులు పెరుగుతున్నారు. మతాన్ని రక్షిస్తున్నామన్న స్థితిలో వ్యవహరిస్తున్నారు. తమ మతాన్ని తాము గొప్పగా చూసుకుంటున్న తరుణంలో.. కొన్ని రకాల పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. మనిషి దైనందిన జీవితంలో కూడా మతాన్ని ముడిపెట్టి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. అయితే అలీ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు రావడంతో.. ఆయన క్షమాపణలు చెప్పి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com