Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ జనసేన వెనుక బిజెపి!

తెలంగాణ జనసేన వెనుక బిజెపి!

Oktelugu.com 1 day ago

Telangana Janasena: తెలంగాణలో జనసేన ను మరింత యాక్టివ్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ వెనుక బిజెపి ఉందన్నది ఒక అనుమానం. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ ఇంటికి వెళ్లారు.

అటు తరువాతనే పవన్ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. అందుకే పవన్ వెనుక బిజెపి ఉందన్న అనుమానం ఎక్కువమందిలో ఉంది. పైగా ఇటీవల జరిగిన పరిణామాలు చాలా వేగంగా ఉన్నాయి. ఒకదానికొకటి సింక్ అవుతున్నాయి. అయితే తెలంగాణలో చంద్రబాబు స్లో అయ్యారు. పవన్ కళ్యాణ్ దూకుడు పెంచుతున్నారు. ఇదంతా వ్యూహాత్మక మా అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ సమాజంలో చంద్రబాబును వ్యతిరేకిగా చూపించారు. అందుకే ఆయన సైలెంట్ గా ఉంటేనే తెలంగాణ రాజకీయాల్లో రాణించగలరు. అదే పవన్ దూకుడుగా వ్యవహరిస్తే… మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుందన్నది ఒక అంచనా.

* క్లీన్ ఇమేజ్..
పవన్ కళ్యాణ్ కు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆపై సినీ చరిష్మ కూడా ఉంది. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధించేవారు ఉన్నారు. సినీ పరిశ్రమ అండదండలు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ ఆయనకు తెలంగాణలో కలిసి వచ్చే అంశాలు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకే ఒకవైపు పవన్ ద్వారా ఆయన పార్టీని బలోపేతం చేయిస్తూనే.. బిజెపి సైతం బలపడుతూనే.. ఎన్నికల చివరి నిమిషంలో టిడిపి సహకారం తీసుకొని అధికారంలోకి రావాలన్నది బిజెపి ప్రణాళికగా తెలుస్తోంది. ఈ సైలెంట్ వ్యూహంతో భారీ ప్రణాళిక వేసింది బిజెపి.

* ఏపీ మాదిరిగానే..
ఏపీ మాదిరిగా సుదీర్ఘకాలం తెలంగాణలో సైతం రాజకీయం చేసి రాణించాలనుకుంటున్నారు పవన్. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ను క్రియేట్ చేసి.. ఏపీ మాదిరిగా పొత్తులతో ముందుకు వెళ్లి మంచి విజయాన్ని అందుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. అయితే ప్రధాని పర్యటన తరువాత పవన్ వైఖరిలో మార్పు రావడానికి గమనించాయి తెలంగాణ పార్టీలు. అందుకే అప్పుడే పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయి. కవిత లాంటివారు తెలంగాణలో ఇప్పుడు ఉన్న పార్టీలు చాలు. సినిమా వారిని నమ్మే పరిస్థితిలో లేము అంటూ తేల్చి చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా భయం కనిపిస్తోంది. ఇదంతా పవన్ వల్లే. పవన్ వెంట బీజేపీ ఉందన్న భయంతోనే తెలంగాణలో రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. కానీ పవన్ మాత్రం తెలంగాణలో సైతం సత్తా చాటాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com