Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana corruption : 40 కోట్ల కాంట్రాక్టు.. మహిళా ఐఏఎస్ అధికారి కి 2.5 కోట్లు.. ఇదో అంతులేని అవినీతి కథ..

Telangana corruption : 40 కోట్ల కాంట్రాక్టు.. మహిళా ఐఏఎస్ అధికారి కి 2.5 కోట్లు.. ఇదో అంతులేని అవినీతి కథ..

Oktelugu.com 2 weeks ago

Telangana corruption : వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదు. ఈ సామెతను గడిచిన కొన్ని సంవత్సరాలుగా మహిళ ఐఏఎస్ అధికారి నిజం చేసి చూపిస్తున్నారు.

చూపించడమే కాదు దర్జాగా కోట్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇదంతా కూడా వాట్సప్ కాల్ ద్వారా ఆమె చేసి చూపిస్తున్నారు.

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ శాఖలో ఆ మహిళా అధికారి కీలకంగా ఉండేవారు. గతంలో ఆమె తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుపొందిన జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆమె ఒక శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్నారు. ఈ శాఖలో రకరకాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సంస్థకు ఆమె కాంట్రాక్టు కట్టబెట్టారు. ఏకంగా 40 కోట్ల టెండర్ ఆ సంస్థకు అందే విధంగా చూశారు. అప్పటినుంచి ఆ సంస్థ ఆధిపతులకు.. ఆ మహిళ ఐఏఎస్ అధికారికి ఫెవికాల్ సంబంధం ఏర్పడింది. ఆ అధికారికి.. కంపెనీకి మధ్య వ్యవహారాలు చక్కబెట్టడానికి ఒక ఏడి స్థాయి అధికారి పనిచేసేవారు. గులాబి పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో ఎవరు ఉన్నా సరే ఆ శాఖకు సంబంధించిన కాంట్రాక్ట్ మొత్తం ఆ కంపెనీకి దక్కుతుంది. పైగా ఎటువంటి నిబంధనలు పాటించే అవకాశం లేకుండానే ఆ మహిళా అధికారి ఆ సంస్థకు టెండర్ దక్కే విధంగా చూస్తుంటారు.

ప్రభుత్వ మారినప్పటికీ.. అధికారులు మారినప్పటికీ ఆ మహిళ ఐఏఎస్ అధికారి మాత్రం ఆ శాఖలోనే ఉంటారు. పైగా ఆ కంపెనీకి మాత్రమే కాంట్రాక్ట్ దక్కే విధంగా చూస్తుంటారు. ఇలా కాంట్రాక్ట్ దక్కేలా చూసినందుకు ఆ కంపెనీ ఆ మహిళా అధికారికి ఏకంగా 2.5 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. రెండు విడతలుగా అది కూడా నగదు రూపంలో ఆ మహిళ అధికారికి ఆ కంపెనీ నిర్వాహకులు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇదంతా కూడా కేవలం వాట్సాప్ కాల్ ద్వారా జరిగిపోవడం మరింత విశేషం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ. ఆ మహిళా అధికారి ఆ శాఖలో ఉంటుంటారు. ఆమెను బదిలీ చేసే సాహసం ఏ ప్రభుత్వం కూడా చేయదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని రూపుమాపడానికి ప్రయత్నాలు చేస్తోంది. అవినీతి అధికారులను అరెస్ట్ చేయిస్తుంది. వారి ఆస్తులను బయటపెడుతున్నది. అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నది. అయినప్పటికీ ఇటువంటి మహిళా అధికారులు ఏమాత్రం భయం లేకుండా సంపాదిస్తున్నారు అంటే వారి వెనుక బలమైన అండ ఉందని అర్థం. మరి ఇటువంటి అండలను ఏ విధంగా తొలగిస్తారు.. అవినీతి అధికారులను ఏ విధంగా శిక్షిస్తారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com