Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana folk songs: ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ ఫోక్ సాంగ్స్ మీద పడుతున్నారుగా..

Telangana folk songs: ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ ఫోక్ సాంగ్స్ మీద పడుతున్నారుగా..

Oktelugu.com 3 weeks ago

Telangana folk songs: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడానికి వింటేజ్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే 'రంగస్థలం' సినిమా వచ్చిందో అప్పటినుంచి కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరిగింది.

అలాగే క్యారెక్టరైజేషన్ మీద కూడా సినిమా కథలను రన్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మూస ధోరణిలో కాకుండా కొత్త కథల వైపు అడుగులు వేస్తూ ఉండడంతో చాలామంది ప్రేక్షకులు సైతం కొత్తదనాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మూస ధోరణిలో కథలు వచ్చేవి కానీ ఇప్పుడు మాత్రం వైవిద్య భరితమైన కథలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అమాంతం పెరిగిపోయింది. కాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం పక్కన పెట్టేసి మన వాళ్లు ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక తెలంగాణ నేటివిటికి తగ్గట్టుగా సినిమా కథలను మలుస్తూ సక్సెస్ లను సాధించడంలో చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటీ ఉన్న స్టార్ హీరోలు సైతం తెలంగాణ స్లాంగ్ మీద ఆధారపడుతున్నారు. ఇక అలాగే ఫోక్ సాంగ్స్ ను సైతం సినిమాలో పెట్టి ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్యారడైజ్ సినిమా నుంచి ‘ఏసే నాగుల కట్టమీద’ అంటూ ఒక సాంగ్ రిలీజ్ అయింది.

నిజానికి ఈ సాంగ్ ఫోక్ లో అత్యంత పాపులారిటి ని సంపాదించుకున్న సాంగ్ కాబట్టి అందులో కొన్ని లిరిక్స్ ని చేంజ్ చేసి ట్యూన్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తూ ప్రేక్షకుల్లోకి వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఈ సినిమాలో ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికైతే ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ను ఆడ్ చేసి సక్సెస్ లను సాధించారు. ఇక రాబోయే సినిమాల్లో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం వస్తున్న ఫోక్ సాంగ్స్ పాపులారిటిని సంపాదించుకోవడం వల్ల వాటిని సినిమాల్లో కూడా పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం విశేషం…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com