Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telugu People In America: అమెరికాలో తెలుగు వారు దారి తప్పుతున్నారు.. సంచలనం కలిగిస్తున్న యువతి వీడియో

Telugu People In America: అమెరికాలో తెలుగు వారు దారి తప్పుతున్నారు.. సంచలనం కలిగిస్తున్న యువతి వీడియో

Oktelugu.com 1 week ago

Telugu People In America: అమెరికా కల్చర్ విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు ఒంటరిగా పెరుగుతుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ చేస్తుంటారు.

ముఖ్యంగా వైవాహిక వ్యవస్థ మనదేశంలో బలంగా ఉంటుంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు కూడా వైవాహిక వ్యవస్థను బలంగా నమ్ముతుంటారు. ఏకపత్ని.. ఏక పతి విధానాలను నిష్టగా పాటిస్తూ ఉంటారు.

అమెరికాలో మాత్రం అలా ఉండదు. అక్కడి ప్రజలు నచ్చినంత కాలం వరకు కలిసి ఉంటారు. నచ్చకుంటే విడాకులు తీసుకుంటారు. తమ దారి తాము చూసుకుంటారు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు కూడా అమెరికన్ కల్చర్ కు అలవాటు పడినట్టు కనిపిస్తోంది. ఇదేదో తెలుగు వాళ్ళ మీద మేము చేస్తున్న ఆరోపణ కాదు. విమర్శ అంతకంటే కాదు. సోషల్ మీడియాలో ఒక యువతి మాట్లాడిన మాటలు ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళ వ్యవహార శైలి మీద తీవ్రస్థాయిలో చర్చకు కారణమవుతున్నాయి.

ఆ వీడియోలో ఆ యువతి చెప్పిన మాటలు సంచలనం కలిగిస్తున్నాయి.. ఇటీవల కాలంలో అమెరికాలో స్థిరపడిన వాళ్లలో వివాహేతర బంధాలు.. షుగర్ డాడి కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.. వివిధ సామాజిక చర్చలు.. ఫోరమ్ లు
.. కౌన్సిలింగ్ నివేదిక ద్వారా ఇవి వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారాలు ఒక నిర్దిష్ట సమాజానికి మాత్రమే పరిమితం కావడం లేదు. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రవాస తెలుగువారు ఈ తరహా బంధాలకు అలవాటు పడుతున్నారు.. ఒత్తిడి.. ఒంటరితనం.. అమెరికాలో ఉండే ఐటీ ఉద్యోగాల ఇబ్బంది.. కుటుంబానికి దూరంగా ఉండడం.. ఈ కారణాల వాళ్ల చాలామంది బయట వ్యక్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఉద్యోగ సమయాలు వేరువేరుగా ఉండడం.. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల దంపతుల మధ్య మానసికంగా దూరం పెరుగుతోంది. శారీరకంగా కూడా దూరంగా ఉండటంతో వారు వేరే బంధాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత భర్తకు భార్యతోడు.. భార్యకు భర్తతోడు అవసరం. కానీ ఈ సమయంలో భార్యల తోడుకు నోచుకోని వారు షుగర్ డాడీలుగా మారుతున్నారు. డబ్బులు వెదజల్లుతూ.. శారీరక సుఖాన్ని పొందుతున్నారు.

అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళల్లో భార్యాభర్తలు ఆర్థికంగా బలంగా ఉండడంతో.. భాగస్వాములతో సర్దుకుపోవాలనే పట్టింపును పక్కన పెడుతున్నారు. ఇండిపెండెంట్ డిఫిషన్స్ తీసుకుంటున్నారు. దీనికి తోడు ఆధునిక సాంకేతికత.. రకరకాల అప్లికేషన్లు అందుబాటులోకి రావడంతో వివాహేతర సంబంధాలు సులభతరమవుతున్నాయి. వెస్ట్రన్ కల్చర్.. ఇతర లైఫ్ స్టైల్ లకు అలవాటు పడటం కూడా ఈ దారుణాలకు కారణమవుతోంది. మన వివాహ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటాం. బ్రహ్మాండంగా ఆచరిస్తుంటాం. కానీ అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు మాత్రం.. అక్కడ కల్చర్ మాత్రమే గొప్పదని భావిస్తున్నారు. చివరికి దానిని ఫాలో అవుతున్నారు. దానివల్ల ఎన్ని అనర్ధాలు వస్తున్నాయో ఈ యువతి చెప్పిన తీరు ఆందోళన కలిగిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com