Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Today 4 August 2026 Horoscope:  ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు శుభవార్త..

Today 4 August 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు శుభవార్త..

Oktelugu.com 1 week ago

Today 4 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది.. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరించింది.

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఆలోచనలు తప్పవు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఎప్పుడు లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కష్టపడిన వారికి సరైన ఫలితం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని పనులు పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యోగ, ధ్యానం చేయడం మంచిది. సొంత శక్తితో కొన్ని పనులను సమయానికి పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల వల్ల వ్యాపారం విస్తరిస్తుంది. మనసులోకి ప్రతికూల ఆలోచనలను రానివ్వకుండా ఉండాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తను అందుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమయాన్ని అనుకూలంగా మార్చుకొని ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు విజయవంతంగా తమ లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారులు ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటారు. ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. బంధువులతో సరదాగా గడుపుతారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు అవకాశాలు పెరుగుతాయి. ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కలిసివస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) :ఈ రాశి వారు ఈరోజు దూరపు బంధువులను వచ్చి శుభవార్తలు. కొత్త స్నేహాలు ఏర్పడడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లోని రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు తోటి వారి సహకారం ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను ఉద్యోగులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఏవైనా కొత్త పనులు ప్రారంభిస్తే తోటి వారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులు అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం ఫ్రీగా ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కొత్త పరిచయాలతో ఉద్యోగులు మనశ్శాంతిని పొందుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com