Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic Movie: టాక్సిక్ మూవీ రాసింది ఒకటి.తీసింది ఇంకొకట. ఇంతకీ ఫస్ట్ రాసుకున్న కథ ఏంటంటే.

Toxic Movie: టాక్సిక్ మూవీ రాసింది ఒకటి.తీసింది ఇంకొకట. ఇంతకీ ఫస్ట్ రాసుకున్న కథ ఏంటంటే.

Oktelugu.com 2 weeks ago

Toxic Movie: యశ్ మెయిన్ హీరోగా చేసిన 'టాక్సిక్' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

నిజానికి టాక్సిక్ సినిమా మీద మొదట్లో చాలా మంచి అంచనాలైతే ఉండేవి. గీతూ మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాను తీసిందని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్లు కూడా వాళ్లకు నచ్చిన రంగంలో ముందుకు సాగాలనే ప్రయత్నం చేశారు. కానీ నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. నిజానికి గీతూ మోహన్ దాస్ మొదట రాసుకున్న కథ వేరని అదొక రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో మిస్టీరియస్ గా రాసుకున్న కథ అని తెలుస్తుంది.

కానీ హీరో యశ్ తో పాటు ఇంకొంత మంది ఈ సినిమా కథని మార్చేశారు అంటూ ఆమె సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక గీతూ మోహన్ దాస్ ఇలాంటి ఒక వరస్ట్ సినిమాని ఎలా తీసింది మొత్తం బోల్డ్ కంటెంట్ తోనే తెరకెక్కిన ఈ సినిమాను తను ఎలా డైరెక్షన్ చేసిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

లేడీ డైరెక్టర్ అయినందుకు ఆమెకున్న సెన్సిబిలిటీ తో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని తీసి ఉంటే బాగుండేదని కామెంట్లు చేసేవారు కూడా ఉన్నారు. నిజానికి అక్కడ ఏం జరిగింది అనే విషయం మనకు తెలియదు. కానీ మొత్తానికైతే తను రాసింది మాత్రం స్క్రీన్ మీద కనిపించలేదట.

అంటే ఒకటి రాసుకుంటే మరొకటి తీసింది మరి అలా తన కథలో మార్పులు చేర్పులు చేసిన వారు ఎవరు ఒకవేళ ఇందులో యశ్ కి కూడా భాగం ఉందా అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది… యశ్ ‘కెజిఎఫ్ 2’ తర్వాత మరో సినిమా చేయకుండా దాదాపు 4 సంవత్సరాల పాటు తన డేట్స్ ను తన టైమ్ ను ఈ మూవీ మీదనే కేటాయించాడు….

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com