Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్ కారణంగానే యుద్ధం.. అమెరికా రాయబారుల సంచలన నిర్ణయం

ట్రంప్ కారణంగానే యుద్ధం.. అమెరికా రాయబారుల సంచలన నిర్ణయం

Oktelugu.com 1 month ago

Donald Trump Ukraine Policy Controversy: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మొదలై మూడేళ్లు దాటింది. తాను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో యుద్ధాలు ఆపేస్తానని ప్రకటించాడు డొనాల్డ్‌ ట్రంప్‌.

అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. కానీ ఇరాన్‌ - ఉక్రెయిన్‌ యుద్ధం మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా ఆ యుద్ధం కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ తాజాగా ఉక్రెయిన్‌ రష్యాపై విరుచుకుపడుతోంది. ఆయిల్‌ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో కీలకమైన ఆయిల్‌ కేంద్రం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఉక్రెయిన్‌లో రాయబారుల రాజీనామాలు చేశారు. ట్రంప్‌ పుతిన్‌ అనుకూల వైఖరి వల్లే రాజీనామా చేశామని బ్రిడ్జెట్‌ బ్రింక్, జూలీ డేవిస్‌ ఆరోపణలు అమెరికా విదేశాంగ విధానానికి సంక్షోభంలోని నెట్టాయి.

రాయబారుల రాజీనామాలు
2022-25 మధ్య ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన బ్రిడ్జెట్‌ బ్రింక్‌ ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా 2025 మేలో రాజీనామా చేశారు. ఆమె స్థానంలో తాత్కాలిక రాయబారిగా నియమితురాలు జూలీ డేవిస్‌ 2026 చివరిలో మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి వీడ్కోలు పలుకుతున్నారు.

ట్రంప్‌పై కీలక ఆరోపణలు
మిచిగాన్‌ కార్యక్రమంలో బ్రింక్, 'ట్రంప్‌ పుతిన్‌కు పదేపదే మద్దతు ఇవ్వడం వల్ల ఉక్రెయిన్‌ రాయబారి పదవి వదులుకున్నాను' అని ఘాటుగా విమర్శించారు. ప్రజాస్వామ్య మిత్రదేశం కంటే రష్యా అధికారిని ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా నైతికతకు విరుద్ధమని చెప్పారు. ఏడాదిపాటు తాత్కాలిక రాయబారిగా పనిచేసిన డేవిస్‌ కూడా ట్రంప్‌ ఉక్రెయిన్‌ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదవీ విరమణ ప్రకటించారు. రాయబారులు ట్రంప్‌ ఉక్రెయిన్‌కు సహాయాలను పరిమితం చేసి, పుతిన్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆగకపోవడానికి అమెరికా వాటా ఉందని పరోక్షంగా సూచించారు.

స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందన
విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్‌ ఈ ఆరోపణలను ఖండించారు. ట్రంప్‌ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాశ్వత శాంతి కోసం పనిచేస్తోందని, డేవిస్‌ దానికి మద్దతుదారుగా ఉందని వాదించారు. ఈ రాజీనామాలు అమెరికా-ఉక్రెయిన్‌ సంబంధాల్లో అస్థిరతను సూచిస్తున్నాయి. ట్రంప్‌ రెంబో విధానం దౌత్య సిబ్బందిని విభజించడంతో ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు బలహీనపడే ప్రమాదం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com