Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వారణాసి క్లైమాక్స్.. అన్ బిలీవబుల్.. మైండ్ బ్లోయింగ్ అంట.. ఇదీ కథ

వారణాసి క్లైమాక్స్.. అన్ బిలీవబుల్.. మైండ్ బ్లోయింగ్ అంట.. ఇదీ కథ

Oktelugu.com 2 weeks ago

Varanasi: రాజమౌళి నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు అది భారీ యుద్ద నేపథ్యంతో కూడుకున్న సినిమా గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో పోరాట సన్నివేశాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది.

ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. వారణాసి సినిమాతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. తను ఇంతకుముందు చేసిన సినిమాలకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై అవార్డు లను అందుకుంటున్నప్పటికి వారణాసి సినిమా షూటింగ్ మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయడం లేదు. దేనికి అదే అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ఫ్రాన్స్ వేదికపై రాజమౌళికి దక్కిన గౌరవం భారతీయ సినీ పరిశ్రమ కి దక్కిన మరో గుర్తింపుగా నిలిచింది. అలాంటి రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచస్థాయి దర్శకులు సైతం గొప్పగా చెబుతున్నారు. ఎక్కడ చూసిన మనకు రాజమౌళి పేరే వినిపిస్తుంది అంటే నిజంగా అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అనే చెప్పాలి… ప్రముఖ వాల్ ఆఫ్ ఫిలిం మేకర్స్ లో రాజమౌళి పేరు చేర్చడం కూడా ఒక అరుదైన గౌరవంగా ఆయన భావిస్తున్నాడు.

ఇక తనకే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సైతం ఆయన ఒక దిక్సూచి గా మారాడనే చెప్పాలి. నిజానికి ఒకప్పుడు మన సినిమాలు తెలుగుకి మాత్రమే పరిమితమయ్యేవి బాలీవుడ్ లో సైతం మన సినిమాలను ఆదరించే వారు కాదు. కానీ రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో మన సినిమాల స్థాయి అమాంతం పెరగడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులు సైతం మనందరిని గౌరవిస్తున్నారు.

మన సినిమాలంటే ఏంటో వాళ్లకు తెలిసి వచ్చింది… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ ని చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్లైమాక్స్ కోసం దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

క్లైమాక్స్ చాలా గ్రాండియార్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com