Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు!

వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు!

Oktelugu.com 5 days ago

YCP Leaders: కొందరు రాజకీయ పార్టీల నేతలు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఒకసారి పదవి చేపడితే చాలు వారికి కన్ను మిన్ను కానరాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అలానే ఉంటారు.

పోలీసులంటే లెక్క చేయరు. వ్యవస్థలపై ఆయన గౌరవంగా మాట్లాడరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. అయితే అది అన్నివేళలా పనిచేయదు. నిన్న అలానే ఓవరాక్షన్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. వ్యాన్లోకి ఎత్తిపడేసారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* రైతుల పరామర్శ పేరుతో..
గుంటూరు జిల్లా మామిడళ్లలో మొక్కజొన్న రైతులను పరామర్శించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదు. అయినా సరే బయలుదేరారు జోగి రమేష్. పోలీసుల కళ్ళుగప్పి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జోగి రమేష్ ను వెంబడించి మరి పట్టుకున్నారు పోలీసులు. సార్ అనుమతి లేదు. దయచేసి రండి అంటూ వారు కోరారు. కానీ జోగి రమేష్ వినలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నన్ను పట్టుకోకండి అంటూ హెచ్చరించారు. కేకలు కూడా వేశారు. పోలీసులు సైతం అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. భయపడేది లేదని హెచ్చరిస్తూ బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించి తమ ప్రతాపం చూపారు. పోలీసులకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

* పోలీసులంటే రెస్పెక్ట్ లేకుండా..
ఇటీవల పోలీసులు అంటే రెస్పెక్ట్ లేకుండా వ్యవహరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు అయితే బహిరంగంగానే పోలీస్ అధికారులపై విరుచుకుపడ్డారు. రెస్పెక్ట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే ఏకంగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. అయితే వైసిపి నేతలతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వారు రెచ్చిపోతున్నారు. అయితే నిన్న ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులే మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇచ్చి పడేశారు. పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో జోగి రమేష్ తోక ముడుచుకోవాల్సి వచ్చింది. అయితే ఇకనుంచి ఏపీలో వైసీపీ నేతలకు తగిన పోలీస్ ట్రీట్మెంట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వ్యవహారంతో..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com