Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Varun Tej : 'కొరియన్ కనకరాజు' కంటే 'దూకుడు' రీ రిలీజ్ కి ఎక్కువ గ్రాస్..అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉంటాయని ఊహించలేదు..

Varun Tej : 'కొరియన్ కనకరాజు' కంటే 'దూకుడు' రీ రిలీజ్ కి ఎక్కువ గ్రాస్..అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉంటాయని ఊహించలేదు..

Oktelugu.com 4 days ago

Varun Tej : యంగ్ హీరో కి అయినా , స్టార్ హీరో కి అయినా , సక్సెస్ ఫార్మ్ ఎంత ముఖ్యమో కొన్ని ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. నిన్న గాక మొన్న వచ్చిన హీరోలు , ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో స్థిరపడిన హీరోలను డామినేట్ చేసే రేంజ్ కి వచ్చారంటే , సక్సెస్ కి ఉన్న విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అందుకు క్లాసిక్ ఉదాహరణ గా నిల్చిపోయాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఈయన కెరీర్ లో చాలా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. అందరి హీరోలు లాగా కాకుండా, కాస్త డిఫరెంట్ సినిమాలు తీయడం వరుణ్ తేజ్ స్టైల్ అనే బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. కానీ ఈమధ్య కాలం లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల , వరుణ్ తేజ్ బ్రాండ్ బాగా దెబ్బ తినింది.

రీసెంట్ గా ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వం లో ‘కొరియన్ కనకరాజు’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రొమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగుంటాయని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ అలాంటి పరిస్థితి కనుచూపు మేర కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై రెండు రోజులైంది. కానీ ఇప్పటి వరకు బుక్ మై షో యాప్ లో ఈ సినిమా ట్రెండింగ్ లోకి రాలేదు. ఇది నిర్మాతలు భయపడాల్సిన విషయమే. చిన్న చిన్న సినిమాలు కూడా బుక్ మై షో యాప్ లో ట్రెండ్ అయ్యే రోజులివి. అలాంటిది 2 రోజులు గడుస్తున్నా కూడా ట్రెండింగ్ లోకి రాలేదంటే , వరుణ్ తేజ్ మార్కెట్ ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా పక్కన పెడితే , ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘దూకుడు’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు జరిగినంత అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ‘కొరియన్ కనకరాజు’ కి జరగలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం , దూకుడు చిత్రానికి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘కొరియన్ కనకరాజు ‘ కి కేవలం 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే , ‘కొరియన్ కనకరాజు’ కి కచ్చితంగా పాజిటివ్ టాక్ భారీ రేంజ్ లో రావాల్సిందే , లేదంటే నష్టాలు తప్పేలా లేవు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com