Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వయసును బట్టి ఎంతసేపు నిద్రపోవాలి.. తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుంది..

వయసును బట్టి ఎంతసేపు నిద్రపోవాలి.. తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుంది..

Oktelugu.com 3 days ago

Age wise Sleep duration: మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రక్రియలు నిద్ర సమయంలో జరుగుతాయి.

అందుకే వయసును బట్టి సరిపడా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారు ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు చూద్దాం..

Sleep Foundation మార్గదర్శకాల ప్రకారం.. వయసును బట్టి సరైన నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పెద్దల కంటే చిన్నపిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. 4 నుంచి 12 నెలల వయసున్న శిశువులు రోజుకు 12 నుంచి 16 గంటల వరకు నిద్రపోవాలి. ఈ దశలో వారి శారీరక, మానసిక ఎదుగుదల వేగంగా జరుగుతుండటంతో ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది. 1 నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. అలాగే 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవడం మంచిది. ఈ వయసులో మెదడు అభివృద్ధి, నేర్చుకునే సామర్థ్యం, శారీరక ఎదుగుదలకు తగిన నిద్ర ఎంతో ఉపయోగపడుతుంది.6 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు 9 నుంచి 12 గంటల వరకు నిద్రపోవాలి. ఇక యుక్తవయసులో ఉన్న 13 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు 8 నుంచి 10 గంటల నిద్ర తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నిద్ర లేకపోతే చదువుపై దృష్టి తగ్గడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

18 ఏళ్లు దాటిన పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోవాలి. తగిన నిద్ర తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే రోజంతా చురుకుగా ఉండేందుకు నిద్ర ఎంతో అవసరం.

అయితే తక్కువ నిద్ర ఎంత ప్రమాదకరమో, అతిగా నిద్రపోవడం కూడా అంతే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దలు రోజూ 9 గంటలకుపైగా నిద్రపోతుంటే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. థైరాయిడ్ సమస్యలు, డిప్రెషన్, స్లీప్ అప్నియా, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా అధిక నిద్ర రావచ్చు.

నిద్ర నాణ్యత కూడా నిద్ర వ్యవధి అంతే ముఖ్యమైనది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మొబైల్ ఫోన్లు, టీవీల వినియోగాన్ని తగ్గించడం, కాఫీన్ ఎక్కువగా తీసుకోకపోవడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం వంటి అలవాట్లు మంచి నిద్రకు దోహదపడతాయి. సరిపడా నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది అని నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com