Dailyhunt
వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' కథను బాలయ్య హిట్ మూవీని నుంచి కాపీ చేశారా...త్రివిక్రమ్ ఇక మారడు...

వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' కథను బాలయ్య హిట్ మూవీని నుంచి కాపీ చేశారా...త్రివిక్రమ్ ఇక మారడు...

Oktelugu.com 5 days ago

Venkatesh Adarsha Kutumbam Movie Story: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ లేదంటే సమ్మర్లో గాని రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో ఒక మైథాలాజికల్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మరొక ఎత్తుగా మారబోతుందట. అయితే ఈ సినిమాలో కామెడీతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరు ఊహించి ఉండరు.

ఆయన కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలను చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల కంటే యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. వెంకటేష్ ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేయగలిగే కెపాసిటి ఉన్న నటుడు కావడం వల్ల ఈ సినిమాని సైతం అదే రేంజ్ లో డిఫరెంట్ గా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు…

ఈ సినిమాని ఒకప్పుడు బాలయ్య బాబు హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘టాప్ హీరో’ సినిమా జానర్ లోనే తెరకెక్కిస్తున్నారట. ఇక ఆ సినిమా కథకి ఈ సినిమా స్టోరీ కి చాలా దగ్గర సంబంధం ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి అనుగుణంగానే త్రివిక్రమ్ ఈ సినిమా స్టోరీని కొంచెం మార్చి క్యారెక్టర్స్ ని చేంజ్ చేసి సినిమాను ముందుకు తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది.

గతంలో సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల హీరో హీరోయిన్లుగా చేసిన మీనా సినిమాని నింథన్ తో అఆ అనే పేరుతో రీమేక్ చేసిన విషయం మనకు తెలిసిందే… అలా పాత సినిమాల నుంచి రిఫరెన్స్లను తీసుకొని కొత్త సినిమాని చేయడం త్రివిక్రమ్ కి మొదటి నుంచి అలవాటే కాబట్టి ఈ సినిమాని సైతం అదే రీతిలో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com