Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ ఎలాగూ ఒక సీటు వదులుకోవాలి.. కాబట్టి దాన్ని త్రిష కు ఇస్తాడా?

విజయ్ ఎలాగూ ఒక సీటు వదులుకోవాలి.. కాబట్టి దాన్ని త్రిష కు ఇస్తాడా?

Oktelugu.com 3 weeks ago

Vijay giving seat to Trisha: మన దేశ రాజ్యాంగం ప్రకారం.. మన దేశ ఎన్నికల వ్యవస్థ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక అసెంబ్లీ లేదా ఒక పార్లమెంట్ స్థానం నుంచి మాత్రమే చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థానాలలో పోటీ చేసినప్పటికీ.. వాటిల్లో విజయం సాధించినప్పటికీ.. ఒకదాని నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. మిగతా చోట్లలో రాజీనామా చేయాలి.. మనదేశ రాజకీయ చరిత్రలో ఎంతోమంది నాయకులు ఒకటికి మించి స్థానాలలో పోటీ చేశారు. గెలిచిన తర్వాత కొన్ని స్థానాలను వదులుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విజయ్ కూడా చేరబోతున్నారు.

TVK పార్టీ అధినేతగా విజయ్ చెన్నై నగరంలోని పెరంబురు, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో కూడా ఆయన విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ పరిస్థితి గొప్పగా లేదు. వరుస సమస్యలతో ఆయన ఇబ్బంది పడ్డారు. రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రెండు స్థానాలను ఎంచుకున్నారు.

రెండు స్థానాలలో ఏదో ఒక దాంట్లో గెలిస్తే.. చెన్నై శాసనసభకు వెళ్లడానికి అవకాశం ఉండేదని ఆయన భావించారు. వాస్తవానికి ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని విజయ్ కి అంతగా నమ్మకం లేదు. డీఎంకే అప్పటికే డబ్బులను మంచినీటి కంటే ఎక్కువగా ఖర్చు పెట్టింది. అన్న డీఎంకేకు బిజెపి సపోర్ట్ ఉంది. ఆర్థికంగా విజయ్ కి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అభ్యర్థులు ఖర్చు విషయంలో కూడా ఆచితూచి పెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోయారు.

విజయ్ రెండు నియోజకవర్గాలలో విజయం సాధించిన నేపథ్యంలో ఆయన పెరంబుర్ స్థానాన్ని వదులుకుంటారని తెలుస్తోంది. ఆస్థానాన్ని త్రిషకు ఇస్తారా.. లేదా మరొకరికి ఇస్తారా అనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీస్తోంది. టివి కే కార్యదర్శి బుస్సీ ఆనంద్ కు ఇస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ లేదు. మరోవైపు త్రిష కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతుల్లో కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవి పూర్తి చేసి పూర్తిస్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

టి వి కే ఏర్పాటు తర్వాత.. త్రిష పార్టీకి సంబంధించిన అనేక విషయాల్లో పాలు పంచుకున్నారని ప్రచారం జరిగింది. ఆ మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను త్రిష కలిసినట్టు వార్తలు వచ్చాయి. త్రిష కలిసిన తర్వాతనే.. విజయ్ రాజకీయ ఎదుగుదల మరో టర్న్ తీసుకుందని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. త్రిష గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తనకు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీవీకే లో అనధికారిక నాయకురాలిగా కొనసాగుతున్న త్రిష.. త్వరలోనే బహిరంగంగా టీవీకేలో చేరి.. పెరంబుర్ స్థానం నుంచి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలిచి.. తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టి వి కే ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. త్రిష రాజకీయ భవిష్యత్తు గురించి విజయ్ ఆలోచిస్తారని.. కచ్చితంగా ఆమెకు లాభం చేకూర్చే పని చేస్తారని తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com