Dailyhunt
విజయ్ గెలవడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యాడా...

విజయ్ గెలవడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యాడా...

Oktelugu.com 1 week ago

Did Pawan Kalyan help Vijay win: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన సాధించిన అంతా ఇంతా కాదు అలాంటి రజినీకాంత్ తో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేశారు.

ఇక రజినీకాంత్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో ఆ రెంజ్ సక్సెస్ ని సాధించిన హీరో విజయ్…ఆయన క్రేజ్ తారా స్థాయిలో ఉంది. నిజానికి విజయ్ టివికే అనే పొలిటికల్ పార్టీని పెట్టాడు. దాన్ని స్థాపించిన సంవత్సరంలోనే ఆయన అధికారంలోకి వచ్చాడు అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 108 సీట్లను గెలుచుకొని తన జెండా ఎగరేశాడు. మొత్తానికైతే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సీఎం అయిన మరో హీరో విజయ్ మాత్రమే అని తమిళ్ జనాలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే విజయ్ గెలిచిన తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ ని కావాలనే ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ గెలుపుకి పరోక్షంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యాడనే విషయం మనలో చాలా మంది మర్చిపోతున్నారు. అది ఎలా అంటే నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ జనానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీని వదులుకొని వచ్చాడు. అలాంటి అతను 2019 వ సంవత్సరంలో సోలోగా పోటీ చేస్తే జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి జనసేన పార్టీ అధ్యక్షుడిని సైతం ఓడించిన ఘనత ఏపీ ప్రజలకే దక్కుతుంది.

నిజానికి పవన్ కళ్యాణ్ 2024 వ సంవత్సరంలో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ను ఫామ్ చేశాడు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఆయన పనితనం కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే తమిళ్ ప్రేక్షకులు సైతం పవన్ కళ్యాణ్ పనితనాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.

ఇక ఇప్పుడు విజయ్ కూడా జనానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఓడించి తప్పు చేయకూడదు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కూడా గెలిస్తే జనానికి ఎంతో కొంత మేలు చేస్తాడని అనుకున్నారట. దాంతో తమిళ జనాలు పవన్ కళ్యాణ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విజయ్ కి కొంత మంది ఓట్లేశారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా విజయ్ గెలుపుకి పవన్ కళ్యాణ్ కూడా కారణమయ్యారంటూ మరి కొంతమంది చెబుతుండడం విశేషం…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com