Dailyhunt
విజయ్ గెలుపు సినిమా స్టైల్ లో సాగిందా...

విజయ్ గెలుపు సినిమా స్టైల్ లో సాగిందా...

Oktelugu.com 5 days ago

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్…రజినీకాంత్ తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరంలో ఆయన టీవీకే అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు.

ఇక ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అతని మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ అతన్ని తొక్కేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికి విజయ్ మాత్రం జనాల మెప్పు పొందుతూనే వచ్చాడు. ఎట్టకేలకు రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టివికే పార్టీ 108 సీట్లు కైవసం చేసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా తమిళనాడు ప్రజలు విజయ్ వెంటే ఉన్నారు అనేది ప్రూవ్ చేశారు.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ లో 234 సీట్లు ఉన్నాయి. ఒక పార్టీ గవర్నమెంట్ ను ఫామ్ చేయాలంటే 118 సీట్లు అయితే కావాలి. విజయ్ కి 108 సీట్లు వచ్చాయి. కాబట్టి మరొక పది సీట్లు అదనంగా ఆడైతే ఆయన గవర్నమెంట్ ను ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థులను, చిన్నచితక పార్టీల్లో గెలిచిన వాళ్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

వాళ్లతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ పార్టీ పెట్టిన సంవత్సరంలోనే గెలుపొందడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి సాధ్యం రీతిలో ఆయన విజయమైతే సాగింది. నిజానికి విజయ్ గెలుపు ఒక సినిమా స్టైల్ లో సాగింది. ఇలా పార్టీ పెట్టేసి అలా గెలిచేసాడు.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ గెలుపు అనేది ఓకే కానీ తమిళనాడు ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం విజయ్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. తను గెలుపు కోసం పెద్దగా కష్టపడలేదు. కాబట్టి గెలిచిన తర్వాత ఆయన జనానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే బావుంటుందని కామెంట్స్ చేస్తున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com