Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vinayaka Chavithi 2026 : వినాయక చవితి ఎప్పుడు?సెప్టెంబర్ లో ముఖ్యమైన పండుగలు ఏవి?

Vinayaka Chavithi 2026 : వినాయక చవితి ఎప్పుడు?సెప్టెంబర్ లో ముఖ్యమైన పండుగలు ఏవి?

Oktelugu.com 3 weeks ago

Vinayaka Chavithi 2026 : హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసంను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహిస్తారు. అయితే ఈ మాసం తర్వాత బాధపడమాసం వస్తుంది.

శ్రావణమాసం లాగే ఈ మాసంలో కూడా ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి. వీటిలో వినాయక చవితి ప్రధానమైనది. తొమ్మిది రోజులపాటు గణనాథుడు వాడవాడల భూలోకంలో పూజలు అందుకొని ఆ తర్వాత నిమజ్జనం అవుతాడు. ఈ తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుంది. ఈ పండుగ తో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వంటివి కూడా ఈ నెలలోనే రాబోతుంది. అయితే బాద్రపద మాసంలో ఈ పండుగలు ఏ తేదీలో రాబోతున్నాయి? అలాగే ఈ నెలలో ఉండే ముఖ్యమైన పండుగలు ఏవో చూద్దాం..

తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఆగస్టు 13న ప్రారంభమై సెప్టెంబర్ 11న ముగిస్తుంది. ఆ తర్వాత భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసం ప్రారంభం కి ముందే అంటే సెప్టెంబర్ నెల ప్రారంభంలోనూ కొన్ని ముఖ్యమైన పండుగలు ఉండలున్నాయి. వీటిలో సెప్టెంబర్ నాలుగున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకొనున్నారు. ఈరోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తారు. వాడ వాడలా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. యువకులు అంతా ఉట్లు కొడుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఈ పండుగ అందరినీ ఒక్క చోటు చేర్చి ఆనందంగా ఉంచుతుంది

సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య నిర్వహించుకోనున్నారు. ఈ పండుగకు గ్రామీణ ప్రాంతంలో ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడపడానికి, పంటలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పశువులతో కలిసి రైతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే మరికొన్ని ఇళ్లల్లో కూడా ఇలాంటి పూజలు నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 14న వినాయక చవితి రాబోతుంది. ఈ రోజున గణనాథుడు వాడవాడలో నెలకొని తొమ్మిది రోజులపాటు పూజలు అందుకోనున్నాడు. ఇదే రోజున మహాగణపతి వాక్యార్త సభ కూడా ఉండనుంది. వినాయక చవితి ప్రారంభం తర్వాత ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు ఉంటాయి. కొన్నిచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంతోషంగా గడుపుతారు.

ఈ నెలలో ఇవే కాకుండా ఉమామహేశ్వర వ్రతం, మహాలయ పక్షం, సంకటహర చతుర్థి వంటి ప్రత్యేక రోజులు కూడా రానున్నాయి. అందువల్ల శ్రావణంతోపాటు భాద్రపద మాసాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com