Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Wingman AI Agent : వ్యాపారులకు ఏఐ ఏజెంట్ 'వింగ్ మ్యాన్'..ఇది ఉంటే చాలా వరకు ఖర్చు తక్కువ..

Wingman AI Agent : వ్యాపారులకు ఏఐ ఏజెంట్ 'వింగ్ మ్యాన్'..ఇది ఉంటే చాలా వరకు ఖర్చు తక్కువ..

Oktelugu.com 1 week ago

Wingman AI Agent : ప్రస్తుత కాలంలో చాలా మంది వ్యాపారంపై మోజు పెంచుకుంటున్నారు. అయితే ఒక్కోసారి తమ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నా.. బిజీ కారణంగా సరైన డీల్ చేయలేకపోతుంటారు.

ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా వ్యక్తులను నియమించుకుంటారు. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా ఏజంట్ లా వ్యవహరిస్తూ అవసరమైన పనులు చేస్తుంది. అందులో వింగ్‌మ్యాన్ (Wingman) సాఫ్ట్‌వేర్ చాలా కీలకంగా మారింది. ఇది వ్యాపారులకు తోడుగా ఉండే ఏఐ. ఇది ఏ విధంగా పనిచేస్తుంది? దీని వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి?

వింగ్‌మ్యాన్ అనేది సోషల్ మీడియా ద్వారా వ్యాపార కార్యకలాపాలను విస్తరించే ఏఐ. సాధారణ మాటల్లో చెప్పాలంటే, విమానం నడిపే పైలట్‌కు పక్కన ఉండే ‘వింగ్‌మ్యాన్’ లాంటిది. వింగ్‌మ్యాన్ సాఫ్ట్‌వేర్ ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాను సులభంగా కనెక్ట్ చేసుకోగలుగుతుంది. వ్యాపారానికి కావలసిన క్యాంపెయిన్ పోస్ట్‌లు, చిత్రాలను ఏఐ సాయంతో క్షణాల్లో డిజైన్ చేసి అనుకూలమైన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరింపజేయడానికి అడ్వర్టయిజ్మెంట్ కీలకం. ఇందు కోసం ప్రతిరోజూ వ్యాపారానికి సంబంధించి ప్రతిరోజూ పోస్ట్‌లు పెట్టడం, కంటెంట్ రాయడం వంటి పనులను వింగ్ మ్యాన్ ఆటోమేట్ చేసి వ్యాపారుడి సమయాన్ని ఆదా చేస్తుంది.

కొన్నిసార్లు వ్యాపారులు ఇతర పనుల్లో బిజీగా ఉండి తమకు వచ్చిన కాల్స్, కస్టమర్లను కలుసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా వచ్చిన ప్రతీ డీల్ ను సెట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇలా చాలా వరకు మిస్ కావడంతో తమ వ్యాపార పరిధి తగ్గిపోతుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఏదైన ప్రశ్న వేసినప్పడు వారికి వెంటనే సమాధానం ఇవ్వకపోతే.. వారు ఇతర షాపులోకి వెళ్లే అవకాశం ఉంది.

కానీ కస్టమర్లు ఏదైనా మెసేజ్ చేస్తే కొద్ది సెకన్లలోనే స్పందించి లీడ్ చేజారకుండా వింగ్ మ్యాన్ కాపాడుతుంది. అంతేకాకుండా వ్యాపారి అందుబాటులో లేకపోయినా ఏఐ ఏజెంట్ కస్టమర్లతో మాట్లాడి అపాయింట్‌మెంట్‌లు బుక్ చేస్తుంది. కస్టమర్ల సంభాషణలను విశ్లేషించి, ఏ ప్రొడక్ట్ ఎక్కువ అమ్ముడవుతోంది? కస్టమర్లు ఏ విషయంలో సందేహిస్తున్నారు? అనే డేటాను ఇస్తుంది.

ఉదాహరణకు రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఒక దుస్తుల వ్యాపారం ఉంది. తన బ్రాండ్‌ను పెంచుకోవడానికి ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ ల్లో మెటా యాడ్స్ ద్వారా ప్రకటనలు ఇచ్చేవాడు. కానీ ప్రకటనలు చూసి రోజూ పదుల సంఖ్యలో కస్టమర్లు ఇన్బాక్స్‌లో ధర ఎంత? ఈ డ్రెస్ అందుబాటులో ఉందా? అని మెసేజ్‌లు పెట్టేవారు. రాజేష్ షాప్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల సమయానికి రిప్లై ఇవ్వలేకపోయేవాడు. దీనివల్ల దాదాపు 60% పైగా పొటెన్షియల్ కస్టమర్లు ఇతర షాప్‌లకు వెళ్లిపోయేవారు.

అయితే రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలకు 'వింగ్ ఏఐ' కనెక్ట్ చేయడం వల్ల రాజేష్ బౌటిక్ కు సంబంధించి విశ్లేషించి ప్రొడక్ట్ వివరాలన్నీ తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇన్బాక్స్‌లో ఎవరు మెసేజ్ చేసినా, వింగ్‌మ్యాన్ కొద్ది సెకన్లలోనే ప్రొడక్ట్ ఫోటోలు, ధరలు, అందుబాటులో ఉన్న సైజుల వివరాలు పంపిస్తుంది. దీంతో రాజేష్ అదనపు సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండానే, డిజిటల్ ప్రకటనల ద్వారా వచ్చే ప్రతి లీడ్‌ను అమ్మకంగా మార్చుకోగలిగాడు. వింగ్ మ్యాన్ ఏఐ చాట్ జీపీటీ మాదిరిగానే అనిపించినా.. ఒక వ్యాపారుడికి మనిషి లాగే అన్నిరకాల సహాయం చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com